‘‘రేపటి యుద్దాలను నిన్నటి ఆయుధాలతో గెలవలేము’’

డ్రోన్లు, యూఏవీలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీడీఎస్ అనిల్ చౌహన్;

Update: 2025-07-16 07:58 GMT
సీడీఎస్ అనిల్ చౌహాన్

భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని సీడీఎస్ అనిల్ చౌహన్ అన్నారు. నేటీ యుద్దాన్ని నిన్నటి ఆయుధాలతో గెలవలేమని చెప్పారు. ఢిల్లీలో జరిగిన యూఏవీలు, కౌంటర్ మానవ రహిత వైమానిక వ్యవస్థలు స్వదేశీకరణపై జరిగిన వర్క్ షాపులో జనరల్ చౌహన్ మాట్లాడారు. నేటీ యుద్దాలు రేపటి సాంకేతికతతో పోరాడాలని, కాలం చెల్లిన వ్యవస్థల వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు.

‘‘నిన్నటి ఆయుధ వ్యవస్థతో నేటీ యుద్దాన్ని గెలవలేము. నేటి యుద్దం రేపటి ఆయుధాలతోనే పోరాడాలి’’ అని సీడీఎస్ వ్యాఖ్యానించారు. భారత్ తన వ్యూహాత్మక అవసరాలు, లక్ష్యాలకు కీలకమైన విదేశీ సాంకేతిక పరిజ్ఞానాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సీడీఎస్ పేర్కొన్నారు. ఇవి దేశ రక్షణ సంసిద్దతను బలహీనపరుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ తో జరిగిన సాయుధ ఘర్షణలలో భారత్ స్వదేశీ కౌంటర్ యూఏఎస్ వ్యవస్థలను ఉపయోగించడాన్ని చౌహన్ ప్రస్తావించారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడటం వల్ల ఆయుధాల ఉత్పత్తిని పెంచే దేశ సామర్థ్యం పడిపోతుందని, అటువంటివి ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.
ఆపరేషన్ సిందూర్
‘‘మన భూభాగం, మన అవసరాల కోసం దేశీయంగా అభివృద్ది చేయబడిన కౌంటర్ - యూఏఎస్ వ్యవస్థలు ఎందుకు కీలకమో ఆపరేషన్ సిందూర్ మాకు చూపించింది. మనల్ని మనం రక్షించుకోవడానికి మనం పెట్టుబడి పెట్టాలి..నిర్మించుకోవాలి. దాడి రక్షణాత్మక కార్యకలాపాలకు కీలకమైన ఈ సాంకేతికతలపై మాత్రమే మనం ఆధారపడలేము’’ అని జనరల్ చౌహన్ అన్నారు.
‘‘విదేశీ సాంకేతిక పరిజ్ఞానాలపై ఆధారపడటం వలన మనం సంసిద్దతను బలహీనపరుస్తుంది. ఉత్పత్తిని పెంచే మన సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. జీవనోపాధికి 24 గంటలూ లభ్యతకు కీలకమైన విడిభాగాల కొరతకు దారితీస్తుంది. విదేశీ సామర్థ్యం అందరికి తెలుసు. ప్రత్యర్థులు ఈ వ్యవస్థల సామర్థ్యం ఆధారంగా వ్యూహాలను అంచనా వేయగలరు’’ అని ఆయన చెప్పారు.
పాక్ డ్రోన్లు కూల్చివేశాం
పాకిస్తాన్, భారత్ పై ప్రయోగించిన డ్రోన్లును విజయవంతంగా కూల్చివేసిందని అన్నారు. భారత సైన్యం వాటిని చలన రహిత, చలనశీల ఆయుధాలు ప్రయోగించి తటస్థీకరించిందని చెప్పారు.
‘‘మే 10 న జరిగిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ డ్రోన్లపై మందుగుండు సామగ్రి నిలిపి ప్రయోగించింది. వాటిలో ఏవి భారత సైనిక లేదా, పౌర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించలేదు. వాటిని చాలా వరకు మన వ్యవస్థలతో కూల్చివేశాం. కొన్నింటిని యదార్థంగా సేకరించాము’’ అని సీడీఎస్ అన్నారు.
ఆధునిక యుద్ధంలో డ్రోన్లు
ఆధునిక యుద్ధంలో డ్రోన్ల వాడకం విషయానికి వస్తే డ్రోన్ల వాడకం పరిమాణాత్మకమైనది సీడీఎస్ అంచనా వేశారు. యుద్దంలో వాటి ప్రయోగం విప్లవాత్మకమైందని అన్నారు.
‘‘మనం డ్రోన్లు గురించి మాట్లాడేటప్పుడు ఇవి ఎలాంటివని మీరు అనుకున్నారు. అవి యుద్ధంలో పరిమాణాత్మక మార్పును తీసుకువచ్చాయా? లేక విప్లవాత్మక మార్పును తీసుకువస్తాయా? వాటి అభివృద్ది పరిమాణాత్మకమైనదని నేను భావిస్తున్నాను. యుద్ధంలో వాటి ఉనికి చాలా విప్లవాత్మకమైనది’’ అని జనరల్ చౌహన్ అన్నారు.
సైన్యం డ్రోన్లను విప్లవాత్మక రీతిలో ఉపయోగించడం ప్రారంభించిందిద. మేము చేసిన అనేక యుద్ధాలలో మీరు దీనిని చూశారని ఆయన అన్నారు.
Tags:    

Similar News