ప్రయాగ్ రాజ్ పేరుతో రెండు రైళ్లు, గందరగోళంతోనే తొక్కిసలాట: పోలీసులు
రైల్వే పోలీసుల వాదనలను తోసిపుచ్చిన ఢిల్లీ పోలీసులు;
By : The Federal
Update: 2025-02-16 13:00 GMT
ఢిల్లీ రైల్వేస్టేషన్ లో 14, 15 వ ప్లాట్ ఫాం సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై ఓ ప్రయాణీకుడు పడిపోవడంతో తొక్కిసలాట జరిగిందని ఉత్తర రైల్వే పోలీసులు తెలపగా, ఢిల్లీ పోలీసులు మాత్రం దీనిని ఖండించారు.
వారి కథనం ప్రకారం.. ప్లాట్ ఫాం కి పైకి వచ్చిన రెండు రైళ్లకు ప్రయాగ్ రాజ్ పేరు ఉండటం, అవి వేరువేరు ప్లాట్ ఫాం పైకి వస్తున్నాయని ప్రకటన రావడంతో ప్రయాణీకుల్లో గందరగోళం నెలకొందని దాంతో వారంతా అక్కడికి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు.
అంతకుముందు చివరి నిమిషంలో ప్లాట్ ఫాం మార్చలేదని, కానీ ఒక ప్రయాణీకుడు 14, 15 మధ్య ఉన్న ఎస్కలేటర్ తో పడిపోవడంతో అడ్డంకిగా ఏర్పడి అంతా ఒక్కసారిగా పడిపోయారని రైల్వే పోలీసులు తెలిపారు.
ఒకే లాంటి పేరుతో రెండు రైళ్లు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాకుంభ మేళాకు యాత్రికుల కోసం ప్రయాగ్ రాజ్ ప్రత్యేక రైలు ప్లాట్ ఫాం 16 వద్దకు చేరుకుంటుందని ప్రకటన రావడం ప్రజల్లో గందరగోళానికి దారి తీసింది. అదే పేరుతో ఉన్న మరో ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ అప్పటికే 14 వ నెంబర్ ప్లాట్ ఫాం వద్ద ఆగింది.
ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ కోసం అప్పటికే అక్కడ వేచి ఉన్న ప్రయాణీకులు అది ప్లాట్ ఫాం 16 లో వద్దకు వస్తోందని భావించారు. రైలు వెళ్లిపోతుందనే తొందరలో భయంతో ప్రజలు సామానుతో అందరిని తోసుకుంటూ ఒక ప్లాట్ ఫాం నుంచి మరోదానికి తరలివెళ్లడంతో తొక్కిసలాట జరిగింది.
ఆలస్యంగా నడిచే రైళ్లు..
కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే నాలుగు రైళ్లలో మూడు రైళ్లు ఆలస్యంగా ప్రయాణించాయి. దీని వలన ప్రయాణికులు 12 నుంచి 16 ప్లాట్ ఫాం పై అటు ఇటూ వేచి చూస్తూ ఉన్నారు.
ఫిబ్రవరి 15న రాత్రి ప్లాట్ ఫాం నెంబర్ 14 లో రాత్రి 10.30 గంటలకు బయల్దేరాలి.కానీ అది అప్పటికే స్టేషన్ లో ఉంది. ప్లాట్ ఫాం 12, 13 కుంభ మేళా నుంచి వెళ్లే మగధ్ వెళ్లే ఎక్స్ ప్రెస్, స్వతంత్య్ర సేనాని ఆలస్యం అయ్యాయి.
ప్లాట్ ఫాం 15 నుంచి కుంభమేళా నుంచి వెళ్లే భువనేశ్వర్ కూడా ఆలస్యం అయింది. వీరంతా ప్లాట్ ఫాం పైనే వేచి ఉన్నారు. దీంతో తొక్కిసలాట తీవ్రత పెరిగిందన్నారు.
ఉత్తర రైల్వే వాదన వివాదం..
ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తొక్కిసలాట పై పోలీసులు వాదనను తోసిపుచ్చారు. చివరి నిమిషంలో ప్లాట్ ఫాం మార్చారనే వార్తలను ఖండించారు.
14, 15 ప్లాట్ ఫాం వద్ద సమీపంలో పుట్ ఓవర్ బ్రిడ్జిపై ఒక ప్రయాణీకుడు జారిపడ్డాదని, తరువాత అతని వెనక ఉన్న ఇతరులు కిందపడి జారీ పడ్డారని ఇదే తొక్కిసలాటకు కారణమని చెప్పారు.
ఏ రైళ్లను రద్దు చేయలేదని, వాటి సమయాల్లో ఎలాంటి మార్పు చేయలేదని ఉపాధ్యాయ్ తెలిపారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడిపామని ప్లాట్ ఫాంలను మార్చలేదని ఆయన నొక్కి చెప్పారు.
మహకుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ వైపు వెళ్తున్న ప్రయాణీకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో తొక్కిసలాటలో 18 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇందులో తొమ్మిది మంది మహిళలు, ఐదుగురు పిల్లలు, నలుగురు పురుషులు ఉన్నారు.