ఉత్తర్ ప్రదేశ్: ‘సర్’ కోసం బీజేపీ గ్రౌండ్ లెవెల్ వ్యూహం
జోనల్ కేంద్రాలు, శక్తి యూనిట్లు నెలకొల్పిన కమల దళం
By : The Federal
Update: 2025-11-05 07:34 GMT
శిల్పిసేన్
భారత ఎన్నికల సంఘం దాదాపు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్ లేదా ఎస్ఐఆర్) ను ప్రారంభించబోతోంది. ఈ ప్రక్రియ దేశంలోనే పెద్ద రాష్ట్రం, ఎక్కువ జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ లోనూ ఈసీ ప్రారంభించింది.
అర్హత కలిగిన ఏ ఓటర్ జాబితా నుంచి మిస్ కాకుండా చూసేందుకు రాజకీయ పార్టీలు ఇందుకోసం సరికొత్త వ్యూహాలు పన్నుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ విస్తృతమైన గ్రౌండ్ లెవల్ వ్యూహాన్ని రాష్ట్రమంతా రూపొందించింది.
పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 1.62 లక్షల పోలింగ్ బూత్ లలో బూత్ లెవల్ ఏజెంట్లను(బీఎల్ఏ) ను నియమించింది. దీనికి ‘‘మేరా బూత్ సబ్సే మజ్ బూత్’’ (నా బూత్ అత్యంత బలమైనది. దాన్ని నేను చూసుకుంటా) ప్రచారంలో భాగంగా బూత్ కు ముగ్గురు కార్మికులను కేటాయించింది.
2027 ఎన్నికలకు ముందు బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. వార్ రూమ్ లను ఏర్పాటు చేయడం, సజావుగా జరిగే సర్ ప్రక్రియ కోసం రియల్ టైమ్ పర్యవేక్షణ ను అమలు చేయడం ప్రారంభించింది. బలహీనమైన బూత్ లపై దృష్టి పెట్టడానికి ఇది ఒక ప్రత్యేక వ్యూహాన్ని కూడా ప్రారంభించింది.
పార్టీ కార్యకర్తల అభిప్రాయం ప్రకారం.. 15.44 కోట్ల ఓటర్ల జాబితాను ధృవీకరించడంలో బూత్ లెవల్ ఆఫీసర్లకు సహాయం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల మంది క్రియాశీల సభ్యులను నియమించారు.
ఈ నెట్ వర్క్ నకిలీ, ఎంట్రీలను తొలగించడంలో సహాయపడుతుందని బీజేపీ విశ్వసిస్తోంది. ఇటీవల ఎన్నికలలో ఈ సమస్యకు పదేపదే ఫిర్యాదులు వస్తున్నాయి.
ఎస్ఐఆర్ వ్యూహాం..
బీజేపీ సర్ వ్యూహం ప్రకారం.. ప్రతి బూత్ కు ముగ్గురు కార్యనిర్వాహాకులు బాధ్యత వహిస్తారు.
బీఎల్ఏ- 1: అసెంబ్లీ సమన్వయకర్త. ఎన్నికల సంఘం ముందు పార్టీ ప్రతినిధులతో కలిసి, అసెంబ్లీ సెగ్మెంట్ అంతటా ఓటర్ జాబితా ధృవీకరణను పర్యవేక్షించే పనిలో ఉంటారు.
బీఎల్ఏ-2: కొత్త ఓటర్లతో సహ ఓటర్ సమాచారాన్ని ధృవీకరించడానికి, నవీకరించడానికి బీఎల్ఓ లతో నేరుగా పనిచేసే బూత్ స్థాయి ఏజెంట్. ఫారాలను నింపడం, ఏవైనా లోపాలను గుర్తించడం వారి బాధ్యత కాబట్టి వారి పాత్ర చాలా కీలకమైనది.
బూత్ వర్కర్ కానీ వారు: ఇతర సమూహాల నుంచి నియమించబడిన కార్యకర్తలు ఇతర సమస్యలను గుర్తించి వాటిని బయటి వ్యక్తుల దృక్ఫథాన్ని తీసుకువస్తారు. ఏ ఎన్నికలలోనైనా వీరి పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారి స్థానిక రాజకీయాల కు వెలుపల ఉంటారు. వారి నైపుణ్యం విలువైనదని రాష్ట్ర స్థాయి బీజేపీ అధికారి ఒకరు అన్నారు.
ఈ నిర్మాణంలో జవాబుదారీతనం స్పష్టంగా తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు, బీఎల్ఓల మధ్య సమన్వయం సజావుగా ఉంటుందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ప్రతిబూత్ కమిటీ ఈ ముగ్గురు కార్యకర్తలకు సమన్వయం చేస్తుంది. కానీ ప్రాథమిక బాధ్యత ఈ ముగ్గురు కార్యకర్తలపైనే ఉంటుంది.
రియల్ టైమ్ పర్యవేక్షణ..
ఎన్నికల సంఘం నిర్వహించే సర్ ప్రక్రియను రోజువారీగా సమీక్షించడానికి బీజేపీ అసెంబ్లీ నుంచి బూత్ స్థాయిల వరకూ వార్ రూమ్ లను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లు ఎప్పటికప్పడు ఫిలప్ చేసిన ఫామ్ లను, అలాగే పెండింగ్ లో ఉన్న వాటి సంఖ్యను ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తాయి. ప్రతి ఐదు రోజులకు తరువాత వారానికి ఒకసారి సమీక్షలు నిర్వహించబడతాయి.
18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మొదటి సారి ఓటర్లు చేర్చడం పై ప్రత్యేక శ్రద్ద వహించాలని పార్టీ తన సమన్వయకర్తలను ఆదేశించింది. ‘‘బీఎల్ఓలు తొలగింపులు నిర్వహించారు. అలాగే అర్హత ఉన్న వారిని ఆడ్ (నమోదు) అయ్యారని నిర్ధారించుకోవడం వారి ప్రాధాన్యత’’ అని బీజేపీ కార్యకర్త ఒకరు తెలిపారు.
ఈ ప్రక్రియ కోసం జోనల్ యూనిట్లు, శక్తి కేంద్ర స్థాయిలకు కూడా విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు, బూత్ స్థాయి సన్నాహాలను బలోపేతం చేయడానికి ఈ శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి శక్తి కేంద్రంలో 4- 5 బూత్ లు ఉంటాయి.
అనేక ప్రాంతాలలో బోగస్ ఓటింగ్ జరిగిన సంఘటనలపై బీజేపీ గతంలో ఈకి ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రికార్డులను సరిదిద్దుకోవడానికి సర్ ను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
బలహీనమైన బూత్ లు..
రాష్ట్రంలోని 1.62 లక్షల బూత్ లలో తమ ఉనికి ఉందని బీజేపీ చెప్పుకుంటున్నప్పటికీ ముస్లిం, యాదవ్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో బలహీనతలు ఉన్నాయని పార్టీ అంతర్గత వర్గాలు అంగీకరిస్తున్నాయి.
బీజేపీ ఉనికిని బలోపేతం చేయడానికి ఇతక శక్తి కేంద్రాల నుంచి కార్యకర్తలను తాత్కాలికంగా ఈ బూత్ లకు కేటాయించే ప్రణాళికలు ఉన్నాయి.
సర్ ను కేవలం పరిపాలనాపరమైన ప్రక్రియగానే కాకుండా 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అట్టడుగు వర్గాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక అవకాశంగా కూడా పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల లక్నోలో ‘సర్’ వర్క్ షాప్ నిర్వహించారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరీ సంస్థ ప్రధాన కార్యదర్శి ధరంపాల్ సింగ్ పార్టీ కార్యకర్తలను పూర్తిగా చురుగ్గా ఉండాలని, ధృవీకరణ ప్రక్రియలో బీఎల్ఓలతో సన్నిహితంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.