ఉత్తరప్రదేశ్: దళిత మహిళపై అత్యాచారం, హత్య

యూపీలో రాజకీయ దుమారం రేపిన సంఘటన, పోలీసులు అదుపులో ముగ్గురు అనుమానితులు;

Update: 2025-02-03 11:46 GMT

ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో దళిత మహిళపై జరిగిన అత్యాచారం, హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఓ నిర్జన ప్రదేశంలో ఉన్న కాల్వ నుంచి నగ్నంగా ఉన్న 22 ఏళ్ల మహిళా ఈరోజు మృతదేహాన్ని కనుగొన్నారు.

యువతిని అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహం కళ్లు తీసివేసి, పక్కటెముకలు విరిగిపోయి ఉన్నాయని, కొన్ని లోతైన గాయాలు ఉన్నాయని బంధువులు మీడియాకు తెలిపారు.

ఈ సంఘటనపై పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్ కరణ్ నాయర్ మాట్లాడుతూ.. అరెస్టయిన ముగ్గురూ హరి రామ్ కోరి, విజయ్ సాహూ, దిగ్విజయ్ సింగ్ అని పేర్కొన్నారు. వీరు మద్యం మత్తులో మృతదేహాన్ని కాల్వలో పడేశారని పేర్కొన్నారు.
అఖిలేష్ విమర్శలు..
అయోధ్యలోని ఫైజాబాద్ లోక్ సభ పరిధిలోని మిల్కీపూర్ లో ఇక్కడ ఈ దారుణం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 5న ఇక్కడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది.
దాంతో ఈ సంఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి క్షీణించాయని ఆరోపించారు. పీడీఏ కమ్యూనిటీపై బీజేపీ హయాంలో దారుణాలు కొనసాగుతున్నాయని అన్నారు. ( పీడీఏ అంటే,, పిచ్డే - వెనకబడిన, దళిత అల్ప సంఖ్యాక మైనారీటీలకు సంక్షిప్త రూపం) తమ ఫైజాబాద్ ఎంపీ అయిన అవధేశ్ ప్రసాద్ తో సహ అందరినీ ఈ ఘటన కలిచివేసిందని అన్నారు.
బీజేపీ వేధింపులు కొనసాగుతున్నాయి..
ఎన్నికలు జరుగుతున్న మిల్కిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతోందని అఖిలేష్ ఆరోపించారు. ‘‘ మిల్కిపూర్ ప్రజలు మా వైపు ఉన్నారు. అయితే ప్రభుత్వ ఒత్తిడితో స్థానిక పరిపాలకులు మాత్రం ఎస్పీని ఓడించాలని కోరుకుంటోంది’’ అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బీజేపీ అగౌరవ పరస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు.
రాజీనామా చేస్తానన్న అవధేష్ ప్రసాద్..
దళిత మహిళ అత్యాచారం, హత్య తరువాత స్థానిక ఎంపీ అవధేష్ ప్రసాద్ బీజేపీ విమర్శలు గుప్పించారు. తరువాత అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. మహిళకు న్యాయం చేయకపోతే లోక్ సభకు రాజీనామా చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా ఏడుస్తున్న ప్రసాద్ ను ఆయన సహచరులు ఓదారుస్తున్న దృశ్యం కెమెరాలో రికార్డు అయింది. బడ్జెట్ సెషన్స్ లో దీనిని సభలో లెవనెత్తుతానని అన్నారు. మోదీ మాకు న్యాయం చేయాలి. లేకపోతే రాజీనామా చేస్తానని మరణించిన మహిళ కుటుంబాన్ని పరామర్శించిన తరువాత అవధేశ్ ప్రకటన చేశారు.
యోగ్ని స్నాప్..
విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. ఫైజాబాద్ ఎంపీ ఈ అంశాన్ని తను రాజకీయంగా ఎదగడానికి వాడుకుంటున్నారని అన్నారు.
మిల్కిపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. అయోధ్యలో జరిగిన ఘటనలో కొంతమంది సమాజ్ వాదీ పార్టీ కి చెందిన నేరస్థుల ప్రమేయం ఉందన్నారు. కేసు విచారణ కిందిస్థాయికి వెళ్లగానే వారి ప్రమేయం బహిర్గతమవుతుందని, అందుకే ముందస్తుగా ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు.
పోలీసులు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అన్నారు. పోలీసులు నిష్క్రియాత్వకంగా ఉన్నారని విమర్శించారు. ఆ మహిళ కనిపించకుండా పోయినప్పటికీ నుంచి ఆమె కుటుంబ సభ్యుల రోదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ఉంటే ఆమె ప్రాణాలు కాపాడి ఉండేవారమని ఎక్స్ లోని ఓ పోస్టులో ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో దళితులపై దౌర్జన్యాలు, అన్యాయాలు, హత్యలు జరుగుతున్నాయని రాహుల్ అన్నారు.
బీజేపీ జంగిల్ రాజ్..
దళిత మహిళపై చేసిన అనాగరికత ఏ మనిషికైనా వెన్నులో వణుకుపుట్టిస్తుందని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఇవన్నీ యావత్ మానవాళికే సిగ్గుచేటన్నారు. బాలిక కనిపించకుండా పోయి మూడు రోజులు అవుతున్నా పోలీసులు చేసిందేమీ లేదు అన్నారు.
బీజేపీ జంగల్ రాజ్ లో దళితులు, గిరిజనులు, వెనకబడిన పేదలను ఎవరూ పట్టించుకోవట్లేదని, ఉత్తరప్రదేశ్ అంటే దళితులపై అఘాయిత్యాలకు ప్రభుత్వం పర్యాయపదంగా మారిందని ఆమె అన్నారు.
Tags:    

Similar News