ఉత్తర ప్రదేశ్: జేపీ విగ్రహాం చుట్టూ రాజకీయాలు

లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ కు పూలమాల వేయడానికి అంగీకరించని ప్రభుత్వం

Update: 2025-10-12 10:12 GMT
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్

శిల్పిసేన్

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 123వ జయంతి సందర్భంగా శనివారం లక్నోలోని జేపీ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ) లో జరిగిన పూలమాలల కార్యక్రమంపై యూపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంది.

ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం వేదికను సందర్శిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యూపీ యంత్రాంగ అప్రమత్తంగా ఉండి విగ్రహం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే ఇద్దరు ఎస్పీ కార్యకర్తలు రాత్రి ఆలస్యంగా భవనంలోకి ప్రవేశించి జేపీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇదే సమయంలో అఖిలేష్ జేపీఎన్ఐకి బదులుగా తన పార్టీ కార్యాలయంలో జేపీ కు నివాళులర్పించారు.
ఎస్పీ చీఫ్ వస్తారనే అంచనాల నేపథ్యంలో భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసి రెండు వరుసల బారికేడ్ లను ఏర్పాటు చేసింది. ఆయన వస్తే భారీ సంఖ్యలో మద్దతుదారులు వస్తారని ప్రభుత్వం ఊహించింది. పక్కన ఉన్న రోడ్లను సైతం దిగ్భంధించింది. కానీ అఖిలేష్ మాత్రం తన పార్టీ కార్యాలయంలోనే  ఈ తతంగం కానిచ్చారు. 
ప్రభుత్వం వాటిని ఆపింది
నిర్మాణం, మరమ్మత్తుల పనుల కోసం పరిపాలన విభాగం ప్రస్తుతం భవనాన్ని మూసివేసింది. కానీ ఎస్పీ మాత్రం దీనికి విరుద్దంగా చెబుతోంది. ‘‘సంపూర్ణ విప్లవం’’ నినాదాన్ని సృష్టించి, 1970 లలో అత్యవసర పరిస్థితులలో ప్రధాన పాత్ర పోషించిన దిగ్గజ నాయకుడికి నివాళులు అర్పించకుండా అడ్డుకోవడానికే ఈ ఏర్పాట్లు చేశారని ఎస్పీ ఆరోపించింది.
ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు భద్రతను ఛేదించి, పోలీస్ వలయాన్ని ఛేదించి రాత్రి చీకటిలో విగ్రహాన్ని పూలమాలలు వేశారు. వారు తమ ఫొటోలు, వీడియో సందేశాలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. దీని తరువాత అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
జేపీ నారాయణ్ జయంతి సందర్భంగా యూపీ రాజధానిలో ఇలాంటి దృశ్యాలు కొత్తకాదు. రెండేళ్ల క్రితం, అఖిలేష్ జేపీఎన్ఐసీలో మూసి ఉన్న గేటును దూకి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. మరమ్మత్తుల కారణంగా అప్పుడు కూడా ఎవరిని దగ్గరకు రానివ్వలేదు.
జేపీ ఎన్ఐసీ భావోద్వేగ అనుబంధాలు..
గత సంఘటన దృష్ట్యా అఖిలేష్ యాదవ్ కేంద్రానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. బీజేపీ ప్రభుత్వం జేపీ ఎన్ఐసీ కేంద్రం ను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
సమాజ్ వాద్ పార్టీ కార్యాలయంలో జేపీకి నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు జెపీఎన్ఐసీతో రాజకీయ, భావోద్వేగ అనుబంధాలు ఉన్నాయి. దాని పునాది రాయి వేసినప్పుడూ నేతాజీ( ములాయం సింగ్ యాదవ్), జార్జ్ ఫెర్నాండేజ్ అనేకమంది సీనియర్ ఎస్పీ నాయకులు అక్కడ ఉన్నారు.
ఈ ప్రభుత్వం దానిని నాశనం చేస్తోంది. అంతే కాకుండా వాటిని దాచడానికి ప్రయత్నిస్తోంది’’ అన్నారు. ఆనాటి పాలకులను జేపీ నారాయణ్ మేల్కోల్పారని చెప్పారు.
సమర్థించుకున్న ప్రభుత్వం..
జేపీఎన్ఐసీ తాత్కాలికంగా మూసివేయడంపై యూపీ ప్రభుత్వం కూడా తన వైఖరిని సమర్థించుకుంది. జేపీ నారాయణ్ కాంగ్రెస్ తో పోరాడగా, అఖిలేష్ యాదవ్ నేడు అదే పార్టీతో చేతులు కలిపి, రాహుల్ గాంధీతో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. అటువంటి దివంగత నాయకుడి గురించి అఖిలేష్ యాదవ్ మాట్లాడటం అర్థ రహితమని వ్యాఖ్యానించింది.
‘‘పేదల కోసం పోరాడిన జయప్రకాశ్ నారాయణ్ పురు మీద ఫైవ్ స్టార్ భవనాన్ని నిర్మించాలని సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉంది’’ అని రాష్ట్ర మంత్రి అసిమ్ అరుణ్ అన్నారు.
ప్రజా సొమ్మును దోచుకోవడానికి మొదట ఒక సొసైటీ ఏర్పాటు చేశారని, తరువాత దానికి రూ. 200 కోట్లు తరువాత రూ. 867 కోట్లు ఇచ్చారని, అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేకపోయారని చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.
జేపీఎన్ఐసీ వివాదం...
లక్నోలోని గోమతి నగర్ లో జేపీఎన్ఐసీ నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ భావించారు. ఈ భవనంలో హెలిప్యాడ్, మ్యూజియం, స్విమ్మింగ్ పూల్ ఇతర ఏర్పాట్లు ఉంటాయి. ఎస్పీ ప్రభుత్వంలో దీని కోసం ఒక సొసైటీ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ కు బడ్జెట్ లో మొదట రూ. 200 కోట్లు ప్రతిపాదించిన తరువాత అది ఏకంగా రూ. 800 కోట్లకు పెంచారు.
2017 లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. తదనంతరం మునుపటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీని రద్దు చేసి, భవనాన్ని లక్నో డెవలప్ మెంట్ అథారిటీకి అప్పగించారు. దీనిలో జయప్రకాశ్ నారాయణ విగ్రహం కూడా ఉంది.
Tags:    

Similar News