‘యూసీసీ’ నిబంధనలు సవరించిన ఉత్తరాఖండ్

లిన్ ఇన్ రిలేషన్లకు తల్లిదండ్రులకు నోటీస్, పోలీస్ తనిఖీలు లేవు

Update: 2025-10-19 08:01 GMT

యూనిఫామ్ సివిల్ కోడ్ లోని నిబంధనలు సవరించినట్లుగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నైనిటాల్ హైకోర్టుకు సమర్పించిన 78 పేజీల అఫిడవిట్ లో పేర్కొంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ల గోప్యతను కాపాడటానికి చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

వివాహాం, లివింగ్ ఇన్ సంబంధాల నమోదుకు సంబంధించిన అనేక షరతులు తొలగిస్తున్నామని, దీనివల్ల వ్యక్తులు స్వచ్చందంగా తమ సంబంధాన్ని లేదా వివాహాన్ని నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, కమ్యూనిటీ సర్టిఫికెట్లను తొలగించామని అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది.

ఈ నిబంధనల సడలింపు వ్యక్తుల గోప్యతను కాపాడటంతో పాటు సంబంధాలలో పౌరులకు అదనపు స్వేచ్ఛను ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రభుత్వం వాదించింది. యూసీసీ నిబంధనలు సవాల్ చేసిన పిటిషనర్లు మాత్రం నిజమైన సమస్యల నుంచి ప్రజలను మళ్లించడానికి మాత్రమే ఈ మార్పులు చేశారని ఆరోపించారు.
ప్రధాన మార్పులు..
లివ్ ఇన్ రిలేషన్ చేస్తున్న ఒక జంట లేదా ఇద్దరూ ఇప్పటికే వివాహం చేసుకుంటే లేదా మరొకరు లైవ్ ఇన్ సంబంధంలో ఉంటే వారి మధ్య సహజీవన సంబంధాన్ని నిషేధిస్తాయి. దంపతులలో ఒకరు మైనర్ అయిన లైవ్ ఇన్ సంబంధం నమోదును తిరస్కరిస్తుంది.
గతంలో దంపతులలో ఒకరు 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లు అయితే తల్లిదండ్రులకు తెలియజేయడం తప్పనిసరి. అయితే ఈ ప్రతిపాదిత సవరణ ప్రకారం.. అధికారులు ఇక పై 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. పౌరుల గోపత్య, స్వేచ్ఛ విషయంలో ప్రతిపాదిత సవరణ లివ్ ఇన్ భాగస్వామి గర్భం, పిల్లల పుట్టుక విషయాన్ని కూడా తప్పనిసరిగా తెలియజేయాలనే నియమాన్ని కూడా తొలగించింది.
కొత్త సవరణ ప్రకారం.. ఇక పై సహజీవనం చేస్తున్న జంటలు, పోలీసు దర్యాప్తు లేదా నిఘా ఉండదు. చట్టపరమైన కారణంతో ఫిర్యాదులు చేస్తేనే పరిగణలోకి తీసుకుంటారు. వివాహా నమోదు సమయంలో మతపరమైన లేదా సమాజ ధృవీకరణ పత్రాల అవసరాన్ని తొలగించాలని కూడా సవరణలు ప్రతిపాదించాయి.
రికార్డ్ కీపింగ్ ప్రయోజనాలు..
ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ జి నరేందర్, జస్టిస్ సుభాష్ ఉపాధ్యాయ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు అడ్వకేట్ జనరల్ ఎస్ఎన్ బాబుల్కర్ సమర్పించిన అఫిడవిట్ లో ఈ సవరణలు పేర్కొన్నారు.
మార్పులు రిజిస్ట్రార్ కార్యాలయం నిబంధన 380కి సంబంధించినవని పేర్కొంది. ఇది లివ్ ఇన్ సంబంధాన్ని నమోదు చేయలేని పరిస్థితులను జాబితాలోకి ఎక్కిస్తుంది.
సహజీవన సంబంధాల నమోదు, ముగింపు వంటి వాటిని పేర్కొంది. పోలీసులతో సమాచారాన్ని పంచుకోవడం, స్ఫష్టత, దరఖాస్తుల అప్పీల్ వ్యవధిని పొడిగించడం పై సవరణలు దృష్టి సారించాయని అఫిడవిట్ లో పేర్కొంది.
రిజిస్ట్రార్, స్థానిక పోలీసుల మధ్య డేటా షేరింగ్ పరిధిని పరిమితం చేయడానికి ఈ నిబంధనలు ప్రయత్నిస్తున్నాయని కూడా పేర్కొంది. ఇది కేవలం రికార్డ్ కీపింగ్ ప్రయోజనాల కోసమే జరుగుతుందని స్పష్టం చేసింది.
ఆధార్ అవసరం లేదు
రిజిస్ట్రేషన్, డిక్లరేషన్ ప్రక్రియలలో గుర్తింపుగా ఆధార్ కూడా అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. అఫిడవిట్ ప్రకారంగా దరఖాస్తుదారు ఆధార్ అందించలేనప్పుడూ ఇతర గుర్తింపు పత్రాలను అనుమతిస్తారు.
రిజిస్ట్రార్ సహజీవనం తిరస్కరిస్తే దాని పై ఫిర్యాదును 30 నుంచి 45 రోజులకు పెంచాలని సవరణ ప్రతిపాదించాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో యూసీసీ అమలులోకి వచ్చినప్పటి నుంచి 4 లక్షల మంది తమ వివాహాలను నమోదు చేసుకున్నారు. 58 జంటలు సహజీవనం కింద నమోదు చేసుకోవడం, ఒక జంట తమ సహజీవనం ముగించిందని పేర్కొంది. ఇప్పటి వరకూ 284 జంటలు విడాకులు తీసుకున్నాయి.
Tags:    

Similar News