ఓట్ల తొలగింపుపై 89 లక్షల ఫిర్యాదులు చేశాం: కాంగ్రెస్
బీహార్ లో ‘సార్’ పై కాంగ్రెస్ విమర్శలు;
By : The Federal
Update: 2025-09-01 11:16 GMT
ఉబీర్ నక్షాబందీ
బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదనే ‘ఈసీ’ వాదనలను ఆ పార్టీ అభ్యంతర వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ 89 లక్షల ఫిర్యాదును దాఖలు చేసినట్లు ప్రకటించుకుంది.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ‘ఓట్ల దొంగతనం’ ఆరోపణలను ప్రచారం చేస్తున్న ఆ పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులు జిల్లా ఎన్నికల అధికారుల నుంచి ఆ ఫిర్యాదులు చేసినట్లు పేర్కొంది.
‘‘ఓటర్ల జాబితాలో ఏ అక్రమ ఓటర్ పేరు చేర్చాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదు. అదే సమయంలో ఏ ఓటర్ పేరును తొలగించాలని కూడా కోరుకోవడం లేదు’’ అని కాంగ్రెస్ ప్రచార, మీడియా విభాగం చైర్మన్ పవన్ ఖేరా ఆదివారం పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశం అన్నారు. ఖేరాతో పాటు పార్టీ బీహార్ చీఫ్ రాజేష్ రామ్ ఇతర నాయకులు ఉన్నారు.
సుప్రీం ఆదేశాల ఉల్లంఘన..
బూత్ లెవల్ ఏజెంట్ల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించడానికి ఈసీ నిరాకరిస్తోంది. ఎందుకంటే వీటిని బాధిత వ్యక్తులు దాఖలు చేయాలి. రాజకీయ పార్టీల బీఎల్ఏలు కాదు అని ఖేరా అన్నారు.
బీహార్ లో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్ ల విచారణ జరుగుతోంది. ముసాయిదా జాబితా నుంచి మినహయించబడిన బాధిత ఓటర్లు అవసరమైన చోట్ల వారి వాదనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులను దాఖలు చేయడానికి బీఎల్ఏలు సాయం చేయాలని ప్రత్యేకంగా పేర్కొంది.
ఎస్ఐఆర్ లో ఆసక్తికరమైన నమూనా..
ఓటర్ జాబితా నుంచి పేర్ల తొలగింపుకు ఈసీ నాలుగు కారణాలు ఉదహరించిందని ఖేరా చెప్పారు. ప్రజలు వలసవెళ్లడం, మరణం, చిరునామా మార్పు, డబుల్ ఎంట్రీ అని ఆయన గుర్తు చేశారు.
‘‘వలస సాకుతో 25 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించగా, 22 లక్షల మంది ఓటర్లు చనిపోయారని , 9.7 లక్షల మంది ఓటర్లను వారి ఇచ్చిన చిరునామాలో కనిపించలేదు’’ అని గుర్తించారని వారు వేరే చోట కూడా నమోదు చేసుకున్నట్లు ఏడు లక్షల మంది పేర్లను తొలగించారని ఆయన ఆరోపించారు.
‘సార్’ లో కొన్ని నమూనాలు గమనించామని పేర్కొన్నారు. 20,638 బూత్ లలో 100 కంటే ఎక్కువ పేర్లు తొలగించారు. ‘‘1988 బూత్ లలో 200 కంటే ఎక్కువ పేర్లు తొలగించబడ్డాయి. 7,613 బూతులలో తొలగించిన పేర్లలో 70 శాతం మహిళా ఓటర్లు.
635 బూత్ లలో వలస వర్గం కింద తొలగించిన ఓటర్లలో 75 శాతానికి పైగా మహిళలు ఉన్నారు’’ అని ఆయన ఆరోపించారు. ‘‘ఇది వినడానికి వింతగా ఉంది. ఎందుకంటే సాధారణంగా మహిళలకంటే పురుషులే ఎక్కువగా పనికోసం వలస వెళ్తారు’’ అని ఆయన అన్నారు. చనిపోయిన వారి వాదనలపై ఖేరా మాట్లాడుతూ.. 7,931 బూత్ లలో 75 శాతం ఓటర్ల ను తొలగించారని చెప్పారు.
ఈసీ వాదన..
ఆగష్టు 1న నిర్ణీత ఫార్మాట్ లో ప్రచురించబడిన ముసాయిదా ఓటర్ల జాబితాలోని ఎవరికి సంబంధించి, బీహార్ లోని ఏ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అధికారం ఇచ్చిన బీఎల్ఏ కూడా ఇప్పటి వరకూ ఎటువంటి క్లెయిమ్(ఫారం -6) లేదా అభ్యంతరం(ఫారం-7) సమర్పించలేదని ఈసీ ప్రకటించిన తరువాత కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది.
‘‘ఇవి స్పష్టంగా ప్రజల పరిశీలన కోసం చేపట్టారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు, అన్ని ఇతర వర్గాల నుంచి వాదనలు, అభ్యంతరాలు ఆహ్వానిస్తున్నాయి’’ అని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. మీడియా ఇస్తున్న ఆధారాలు విశ్వసనీయంగా, సహేతుకంగా లేవని కూడా తన ప్రకటనలో పేర్కొంది.