రాముడి సాక్షిగా ‘భరతవర్ష’ పునర్నిర్మాణం ప్రారంభిస్తాం: ఆర్ఎస్ఎస్ చీఫ్
అయోధ్య అంటే యుద్ధంలేని నగరం, సంఘర్షణ లేని ప్రాంతమని అర్థం. కానీ అయోధ్య విముక్తి కోసం వందల ఏళ్లు పోరాడమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
అయోధ్యలో జరిగే రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుకలు దేశ సామరస్యం, ఐక్యత, ప్రగతికి దోహదం చేస్తాయని, ఇక నుంచి వీటిని ‘భరతవర్ష’ పునర్నిర్మాణ ప్రచారానికి వాడుకుంటామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన కథనంలో ఆయన ఈ విధంగా అన్నారు. ఇక నుంచి అయోధ్యలో రామమందిరం పై వివాదాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వందల సంవత్సరాలుగా అయోధ్యలో జరుగుతున్న పోరాటాలను ఆయన వివరించే ప్రయత్రం చేశారు. మొదట 1857లో హిందూ- ముస్లింలు ఈ వివాదంపై ఓ సామరస్య పరిష్కారం కోసం మాట్లాడుకున్నారని, అప్పటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ కూడా గోహత్య నిషేధానికి హమీ ఇచ్చారని చరిత్ర పుటలను తిరగేసే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా వివిధ యుద్ద ప్రణాళికలను రెండు వర్గాలు కలిసి అమలు చేశాయని, చివరకు మనం మొదటి స్వాతంత్ర్యం ఓడిపోయామని అన్నారు. బ్రిటిష్ పాలన నిరంతరం గా కొనసాగింది, అలాగే రామమందిరం కోసం కూడా పోరాటం కొనసాగిందన్నారు.
"భారత సమాజంలో వేల ఏళ్ల కింద ఉన్న నిబద్ధత, విశ్వాసం, నైతికత ఇప్పటికీ కొనసాగుతున్నాయి, అందుకే రామమందిర పోరాటాలు హిందూవుల మనస్సుల్లో నాటుకుపోయాయి, సమాజం ఈ విషయంలో(రామమందిరం) తలవంచలేదు" అని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుక, శ్రీరాముడి జీవిత పరమార్థాన్ని ఆధునిక సమాజం అంగీకరించింది అనడానికి నిదర్శనంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ తన పోస్ట్ లో అభిప్రాయపడ్డారు. "ప్రస్తుత ప్రపంచం విధ్వంసం, అహంభావం, స్వార్థం, వివక్ష కారణంగా అనేక విపత్తులను తనపైకే తనే తెచ్చుకుంటోంది. అయోధ్య లో రాముడి ప్రవేశంతో ఇవన్నీ శాంతిస్తాయి. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపుతుంది " అని మోహన్ భాగవత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆధ్యాత్మిక కాంతిలో ప్రపంచ పునర్మిణానికి మార్గం సుగమం చేస్తాము అని ఆన్నారు.
ఒకటిన్నర వేల సంవత్సరాలుగా దండయాత్రలు
భారత దేశంపై 1500 సంవత్సరాలుగా దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయని భాగవత్ అన్నారు. మొదట దండయాత్రలు దేశంలోని సంపద కోసం జరగగా, అలెగ్జాండర్ కాలం నాటికీ వలస రాజ్యాల స్థాపనకు ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.
కానీ ఇస్లాం రాకతో దేశంపై దాడులు తీవ్రతరం అయ్యాయని, దేశాన్ని, సమాజాన్ని నిరుత్సాహపరచడానికి వారి మత స్థలాలను ధ్వంసం చేసే పనికి పూనుకున్నారని ఆరోపించారు. తద్వారా సమాజాన్ని అవిచ్ఛిన్నంగా పాలించవచ్చనే అనుకునే ఈ దురగతాలకు ఓడిగొట్టారని పేర్కొన్నారు.
ఇప్పుడిక గతం ముగిసింది. గుడి పై ఉన్న అన్నివివాదాలు అంతం కావాలి. హిందువులో ఎన్నో ఏళ్ల పోరాటం తరువాత 2019లో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా న్యాయబద్దంగా విజయం సాధించగలిగారు.
కాగా, రేపు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్టకు ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ సహ దాదాపు 7000 మంది అతిథులు హజరుకానున్నారు. ఈ వేడక కోసం ఇప్పటికే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12. 29 నిమిషాలకు బాలరాముడిని రామమందిరంలో నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రతిష్టించనున్నారు.