లోక్ సభ ఎన్నికల్లో యూపీ మొత్తాన్ని స్వీప్ చేస్తాం: బీజేపీ

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని అన్ని స్థానాల్లో విజయదుందుభి మోగిస్తామని బీజేపీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 400 కు పైగా స్థానాలను గెలుచుకుంటామని మంది.

Update: 2024-02-28 06:37 GMT

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మొత్తం 80 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ప్రకటించింది. యూపీ లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది సీట్లను కమలదళం గెలుచుకోవడంతో తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని బీజేపీ నాయకులంటున్నారు.

"బీజేపీ పోటీకి నిలిపిన ఎనిమిది మంది అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఇది రాబోయే మంచి భవిష్యత్ కు సూచన. ఉత్తర ప్రదేశ్ లో 80 లోక్ సభ సీట్లు ఉన్నాయి. వాటిని ఎన్డీఏ కూటమి స్వీప్ చేస్తుంది. జాతీయ స్థాయిలో మా సంఖ్య 400+ అవుతుంది " అని ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో ఒకరైన సుధాన్షు త్రివేది జాతీయ మీడియాతో అన్నారు.
కొంతమంది సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి ఓటు వేశారు కదా అని ప్రశ్నించినప్పుడు " అలాంటి పరిస్థితి సమాజ్ వాదీ పార్టీలో ఎందుకు ఉత్పన్నమైందో అఖిలేష్ యాదవ్ ఆలోచించాలి" సుధాన్షు అన్నారు. ఎస్పీ అధినేత నోరు తెరిస్తే చాలు.. వెనకబడిన తరగతులు, దళితులు, మైనారిటీల గురించి మాట్లాడతారు..కానీ ఎన్నికల్లో మాత్రం సినీ తారలు, రాజవంశం, బ్యూరో క్రాట్ లను నిలబెడతారని ఆయన విమర్శలు గుప్పించారు.
బీజేపీ యూపీలోని మొత్తం స్థానాలను కైవసం చేసుకుంటుందని మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు ఆర్పీఎన్ సింగ్ కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనపై చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ" ఎస్పీ గురించి దేశమంతా తెలుసు. రౌడీయిజం, గూండాయిజం ఆ పార్టీ పేటేంట్ లు, అలాంటి వారు చేసే ఆరోపణలకు విలువ ఏముంటుంది. ప్రజలు మాకు 80 లోక్ సభ స్థానాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కచ్చితంగా గెలిపిస్తారు" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ఉత్తర ప్రదేశ్ లో మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ కి చెందిన ఎనిమిది మంది విజయం సాధించారు. కాగా ఎస్పీ మూడు స్థానాలకు గాను రెండు మాత్రమే గెలుచుకోగలిగింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో ఈ బీజేపీ విజయం సాధించింది.
బీజేపీ విజయం
యూపీ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్, మాజీ ఎంపీ తేజ్ వీర్ సింగ్, బీజేపీ యూపీ జనరల్ సెక్రటరీ అమర్ పాల్ మౌర్య, మాజీ మంత్రి సంగీత బల్వంత్, బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేదీ, మాజీ ఎమ్మెల్యే సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్, పారిశ్రామికవేత్త సంజయ్ సేథ్ విజయం సాధించారు. వీరిలో పారిశ్రామికవేత్త సంజయ్ సేథ్ ఎస్పీ నుంచి బీజేపీలోకి 2019 లో జాయిన్ అయ్యారు. ఎస్పీ నుంచి జయా బచ్చన్, దళిత నేత రామోజీ లాల్ విజయం సాధించారు. మూడో అభ్యర్థి అలోక్ రంజన్ మాత్రం ఓటమి పాలయ్యారు.


Tags:    

Similar News