శక్తికాంతదాస్ పీఎంఓ కార్యాలయంలోకి రావడం వెనక కారణాలేంటీ?
వాజ్ పేయ్ హయాంలో ఇలాగే ఇద్దరు ఉన్నత స్థాయి అధికారుల నియామకం;
By : Abid Shah
Update: 2025-02-24 06:08 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అదనపు లేదా రెండవ ప్రధాన కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ నియామకం ఢిల్లీ సర్కిల్ లో ఎందుకో అందరి కనుబొమ్మలు ఎగరవేయించేలా చేసింది. కారణం ఏంటంటే.. ఇది అపూర్వమైనది.. పికే మిశ్రా ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)కు ప్రధాన కార్యదర్శిగా నాయకత్వం వహిస్తున్నారు.
దాస్ ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గవర్నర్ గా పనిచేసి రిటైర్ అయిన కొన్ని రోజులకే తిరిగి పీఎంఓ కార్యాలయంలో ఆయనకు చోటు దక్కింది. ఇది ఉన్నత స్థాయిలో ఉన్న మరింత మంది సీనియర్ అధికారులకు పదవీ విరమణ తరువాత వచ్చే ఉద్యోగాల కోసం లాబీయింగ్ ను బలోపేతం చేసిందనే చెప్పాలి.
అధికార యంత్రాంగం
దాస్ నియామకం నిబద్దత కలిగిన బ్యూరోక్రసీని భయపెట్టే చర్యకు దారి తీసిందనే చెప్పాలి. ఈ రోజుల్లో సంబంధిత మంత్రిత్వశాఖలు కాకుండా పీఎంఓ కార్యాలయం అన్ని కీలక నిర్ణయాలకే కేంద్రంగా ఉంటుంది.
కీలక మంత్రిత్వ శాఖలు కూడా ఇప్పుడూ పీఎంఓ ఎంచుకున్న కీలక అధికారులతో నిండి ఉంది. చాలామంది ప్రభుత్వ కార్యదర్శులు పీఎంఓకే రిపోర్టు చేస్తారని చెబుతారు.
ఇటీవల కాలంలో చాలామంది కార్యదర్శులు పదవీ విరమణ తరువాత అనేక పొడిగింపు ఇచ్చారు. ఇది పీఎంఓ ఆదేశం మేరకే జరిగిందని తెలుస్తుంది. ఇతర విషయాలతో పాటు బ్యూరోక్రసీలో రెండవ స్థాయిలో ఉన్నవారికి పీఎంఓ అనేది పదోన్నతి లేకుండా చేసింది.
ఇటీవల కాలంలో ఇలా పదేపదే పొడిగింపులు ఇచ్చిన వారిలో మాజీ క్యాబినేట్ కార్యదర్శి, మాజీ కేంద్ర హోంకార్యదర్శి ఉన్నారు.
స్తబ్ధత..
మోదీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత అధికారుల్లో ఈ స్తబ్ధత నెలకొందని అంటున్నారు. ఇది ప్రస్తుతం ముఖ్య లక్షణంగా మారిందని అనేకమంది బలంగా వాదిస్తున్నారు. డిప్యూటేషన్ పై కేంద్రానికి వచ్చిన రాష్ట్ర కేడర్ లోని చాలామంది అవకాశాలు లేక అక్కడే ఉండిపోతున్నారని అంటున్నారు. దీంతో వారంతా తిరిగి సొంత రాష్ట్రాలకే తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నారు.
కమ్యూనికేషన్ ఫీడ్ బ్యాక్ కమాండ్ కాలేకపోతుందని చాలా బలహీన పడిందని అంటున్నారు. ఉదాహారణకు.. 2022 వేసవి ప్రారంభంలో భారత్ విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరఫరాలో కొరతను గుర్తించింది. కానీ తరువాత కాలంలో పరిష్కారాలను ఇది శాశ్వతం చేయలేకపోయింది.
కమాండ్ నిర్మాణం..
ఇది శక్తివంతమైన పీఎంఓ కింద జరిగింది. ఇప్పుడు ఉన్నతస్థాయి శక్తిని పునరుద్దరించడానికి మరొక ప్రధాన కార్యదర్శిని నియమించుకుంది. ఇతర విషయాలతో పాటు ఇద్దరు ప్రధాన కార్యదర్శుల విధులను స్పష్టంగా ఐక్యంగా గుర్తించి నిర్వహించలేకపోతే ఈ కమాండ్ దారితప్పే అవకాశం ఉంది.
ఇప్పటి ఈ పరిస్థితులు చూస్తే వాజ్ పేయ్ హాయాంలో జరిగిన ఓ సంఘటను గుర్తుకు వస్తుంది. ఎన్డీఏ హయాంలో వాజ్ పేయ్ పీఎంఓ కార్యదర్శిగా కొంతకాలం పాటు బ్రజేష్ మిశ్రా ఉన్నారు. తరువాత శక్తిసిన్హా కూడా జత చేరారు.
కానీ చివరికి సిన్హా ప్రపంచ బ్యాంకులో చేరారు. ఆ తరువాత మిశ్రా మాత్రమే పీఎంఓ లో ఏకైక కార్యదర్శిగా మిగిలిపోయారు. ఇది ఏ స్థాయికి చేరిందంటే మిశ్రా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడూ సాధారణంగా ‘‘కార్యనిర్వాహక ప్రధానమంత్రి’’ అని పిలవబడేవారు. ఇప్పుడు ఆ స్థాయికి వారు చేరతారా? చూడాలి.