మధ్య తరగతి ప్రజలకు ఉత్త చేతులు మిగిల్చారు: విపక్ష ఎంపీలు

ఎన్నికల కోసం బీహార్ కే కు వరాలు గుప్పించారని ఆగ్రహం;

Update: 2025-02-01 13:16 GMT

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ లో సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలకు అందించింది ఏమి లేదని, రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ లెక్కాపత్రాన్ని తీసుకొచ్చిందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. పశ్చిమ బెంగాల్ కు బడ్జెట్ లో ఉత్తచేతులు ఇచ్చారని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్ సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు.

‘‘బడ్జెట్ లో సామాన్యులకు ఏమీ లేదు. వచ్చే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పోయినసారి కూడా ఆంధ్ర ప్రదేశ్, బీహార్ కు అన్నివరాలు గుప్పించారు. ఇప్పుడు ఏపీ ఎన్నికలు ముగిశాయి. బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఇవన్నీ’’ అని బెనర్జీ పార్లమెంట్ కాంప్లెక్స్ లో విలేకరులతో అన్నారు.
పశ్చిమబెంగాల్ కు సంబంధింత వరకూ గత పదేళ్లలో ఏమి ఇవ్వలేదు. ఈ రోజు కూడా అలాగే జరిగింది. ఇది చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ‘‘నేను బడ్జెట్ ను జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది.
బడ్జెట్ ను సమర్పించిన విధానంతో చాలా గందరగోళం ఉంది. ఆర్థికమంత్రి వివిధ వేతన స్లాబ్ లను వేర్వేరు రాయితీలు ప్రకటించారు. కానీ మధ్యతరగతి వారికి ఇందులో ఏమి ఇవ్వలేదు.
తమిళనాడుకు కూడా ఎలాంటి నిధులు ఇవ్వలేదని డీఎంకే లోక్ సభ సభ్యుడు దయానిధి మారన్ విమర్శించారు. ఇది దేశపు తిరోగమన బడ్జెట్ అన్నారు.
‘‘ఇది దేశానికి, మరీ ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు పెద్ద నిరుత్సాహం. ఆర్థిక మంత్రి రూ. 12 లక్షల వరకూ పన్నూ మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఆ తరువాత వరుసలో రూ. 8 నుంచి రూ. 10 వరకూ పది శాతం వరకూ పన్ను శ్లాబ్ ఉంది’’ అన్నారు.
బీహార్ ఎన్నికలు వస్తుందున బీహర్ కోసమే చాలా ప్రకటనలు చేశారు. మళ్లీ బీహార్ ప్రజలను మోసం చేస్తున్నారు’’ అన్నారాయన.
Tags:    

Similar News