అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ ఐక్యతా రాగం దేనికోసం?
సీఎం ను నితీశ్ ను విమర్శిస్తున్నఓ వర్గం కూటమి నేతలు;
By : Gyan Verma
Update: 2025-02-26 10:30 GMT
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం ప్రవేశించింది. కారణం.. ప్రధాని మోదీ తమ కూటమి తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ కూటమిగా తన సందేశాన్ని స్పష్టంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది.
2024 పార్లమెంటరీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 40 లోక్ సభ స్థానాల్లో 30 గెలుచుకున్నప్పటికీ పాలక కూటమి ముందున్న సవాళ్లు కొన్ని అలానే ఉన్నాయి.
ముఖ్యంగా లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్ పాశ్వాన్), జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందూస్థానీ అవామీ మోర్చా(హెచ్ఏఎం) లకు చెందిన కొంతమంది ప్రముఖ నాయకులు కేంద్రమంత్రులు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను విమర్శిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ఇదే వారిని కొంత ఆందోళనపరిచే అంశంగా ఉంది.
మిత్రపక్షాలకు బీజేపీ ఫియట్..
తాను ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లనని సీఎం నితీశ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే చిరాగ్ పాశ్వాన్ మాంఝీ ఉపేంద్ర కుష్వాహా(రాష్ట్రీయ లోక్ మోర్చా) తనను తరుచుగా విమర్శించే బీజేపీ నాయకులలో ఒక వర్గంతో ఆయనకు సత్సంబంధాలు లేవు.
అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు బిహార్ ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటన చేయకూడదని బీజేపీ అన్ని కూటమి భాగస్వాములకు దాని స్వంత నాయకులకు కూడా స్పష్టం చేసింది.
‘‘బిహర్ లో ఎన్డీఏ కి నితీష్ కుమార్ నాయకుడిగానే ఎన్నికలు జరగాలని నిర్ణయించారు. నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ కి నాయకుడు. ఎన్డీఏ ప్రచారానికి మోదీ నాయకత్వం వహిస్తారు.’’ అని జనతాదళ్ నాయకుడు, ముఖ్యప్రతినిధి నీరజ్ కుమార్ ‘ది ఫెడరల్’ తో అన్నారు.
ఐక్యమత్యంగా ఎన్డీఏ
నితీశ్ కుమార్ కు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ, ఎన్డీఏలకు చెందిన కొంతమంది బహిరంగంగా మాట్లాడే సభ్యులతో పాటు కొంతమంది బీజేపీ సభ్యులు ముఖ్యమంత్రి పదవి తమ పార్టీకే రావాలని కోరుకుంటున్నారు.
2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి లోక్ జన శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్, నితీశ్ కుమార్ ను విమర్శించారని సీనియర్ జేడీయూ, బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే జేడీయూ నేత నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. కాలం మారిపోయిందని అంటున్నారు.
‘‘మునుపటి కాలంలాగా ఏమి లేదు. ఇప్పుడు ఎన్డీఏ చాలా సంఘటితంగా ఉంది. పోలింగ్ బూత్ స్థాయిలో ఐక్యతను నెలకొల్పే ప్రయత్నం జరుగుతోంది. బిహార్ లోని ఐదు ఎన్డీఏ పార్టీల ప్రతినిధులు అన్ని పోలింగ్ బూత్ లలో తప్పనిసరిగా ఉండాలి’’ అని ఆయన అన్నారు.
రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో జరిగే ఏదైనా సమావేశానికి అన్ని ఎన్డీఏ భాగస్వాముల రాష్ట్ర లేదా జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని నిర్ణయించారు. ఐక్య ఎన్డీఏని సృష్టించడానికి ప్రయత్నించే ఈ ప్రయోగం ఇంతకుముందు జరగలేదు’’ అన్నారు.
మూడు స్థాయిలలో వ్యూహాం
2025 అక్టోబర్- నవంబర్ బిహార్ ఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్నారు. ఐదు కూటమి పార్టీల మధ్య క్షేత్ర స్థాయి సమన్వయాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని భావిస్తున్నందున బీజేపీ - ఎన్డీఏ నాయకత్వం ఎటువంటి ఛాన్స్ తీసుకుకోవడానికి ఇష్టం పడటంలేదు.
ఎన్డీఏ ఐక్య ఫ్రంట్
ఎన్నికల సన్నద్దతతో పాటు బూత్ స్థాయి కార్యకర్తల బహిరంగ సమావేశాలు, పత్రికా సమావేశాలను సంయుక్తంగా నిర్వహించే వ్యూహాంపై ఎన్డీఏ పనిచేస్తోంది. ‘‘ఎన్నికల సన్నద్దతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని గురించి ప్రజలకు తెలియజేయడం ముఖ్యం.
మేము సంయుక్తంగా ప్రెస్ కాన్పరెన్స్ లు నిర్వహిస్తున్నాం. పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నాం. ఐదు పార్టీలకు అన్ని నియోజకవర్గాలలో ఒకేలాంటి బలం లేదు. కాబట్టి ఆర్జేడీని ఎదుర్కోవడానికి ఎన్డీఏ భాగస్వాములు ఒకరికొకరు సాయం చేసుకోవడం ముఖ్యం’’ అని కుమార్ అన్నారు.
నితీశ్ ను సంతోషంగా ఉంచు..
జాతీయ స్థాయిలో జేడీయూ మద్దతుపై బీజేపీ ఆధారపడి ఉందని, బీహార్ ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్ ను ఇబ్బందిపెట్టడం అది కోరుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
‘‘బీహార్ ఎన్నికలు ఎన్డీఏకు చాలా కీలకమైనవి. ఎన్డీఏ ఐక్యంగా ఉందని అది చూపించాలనుకుంటోంది. బీజేపీ, జేడీ(యూ) మద్దతుపై ఆధారపడి ఉంది. ఇందులో నితీష్ కుమార్ పాత్ర కీలకమైంది.
ప్రస్తుతం నితీశ్ కుమార్, చంద్రబాబును బాధపెట్టాలని అనుకోవడం లేదు. ఇది జాతీయ స్థాయిలో వారిని ఇబ్బందిపెడుతుంది’’ అని కాన్పూర్ లోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ పాలిటిక్స్ డైరెక్టర్ ఎకే వర్మ ది ఫెడరల్ తో అన్నారు.