శుభం ద్వివేదిని అనే అమరవీరుడిగా గుర్తించాలనే డిమాండ్ నెరవేరుతుందా?

ప్రభుత్వానికి విజ్ఙప్తి చేసిన ద్వివేది భార్య అశాన్య ద్వివేది;

Translated by :  Chepyala Praveen
Update: 2025-04-29 10:50 GMT
అశాన్య ద్వివేది

పహల్గామ్ లో సాధారణ హిందూ పర్యాటకులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేసి  26 మందిని పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన జరిగి వారం గడిచిన తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ఇందులో శుభం ద్వివేది కూడా ఒకరు. ద్వివేదిని అమరవీరుడిగా గుర్తించాలని అతని భార్య అశాన్య ద్వివేది భారత ప్రభుత్వానికి హృదయాపూర్వక విజ్ఞప్తి చేశారు.

ఉగ్రవాదులు బైసారన్ గడ్డి మైదానాల్లోకి ప్రవేశించిన తరవాత మొదటగా శుభమ్ ద్వివేదిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇస్లామిక్ కల్మా పఠించమని అడిగారని అతని భార్య వివరించింది.
అలా చేయలేకపోవడంతో అతను కాల్చి చంపబడ్డాడు. కానీ ఈ క్షణంలో ఇతర అమాయక హిందూ పర్యాటకులు తప్పించుకోవడానికి కీలకమైన అవకావాన్ని ఇచ్చిందని ఆమె వాదిస్తున్నారు.
‘‘శుభమ్ ను మర్చిపోకూడదని మేము కోరుకుంటున్నాము. అందువల్ల అతనికి అమరవీరుడి హోదా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను’’ అని అశాన్య అన్నారు.Full View
అమరవీరుడంటే ఏమిటీ?
భారత రక్షణ దళాలలో అమరవీరుడు అనే పదాన్ని తరుచుగా నివాళులు అర్పించే సమయాల్లో, బహిరంగ ప్రదేశ ప్రసంగాలలో ఉపయోగిస్తారు. అయితే అధికారికంగా భారత ప్రభుత్వం ఎక్కడా అమరవీరుడని వర్గీకరించలేదు.
మరణాలను కేవలం యుద్ధ మరణాలు, భౌతిక మరణాలుగా మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ అమరవీరుడు అనే పదం నావికాదళం, వైమానికదళం, సైన్యం పత్రాలలో కూడా అధికారికంగా ఉపయోగించవు.
నిజానికి 2017 లో భారత ప్రభుత్వం పార్లమెంట్ లో ఏ వ్యక్తిని అమరవీరుడు అని ప్రకటించడానికి చట్టపరమైన నిబంధనలు ఏది లేదని స్పష్టం చేసింది. ఈ పదం స్ఫూర్తి శక్తివంతమైనదే అయినప్పటికీ దానికి అధికారిక హోదా లేదా పరిపాలన హోదా లేదు.
పౌరులను అమరవీరులని పిలవొచ్చా?
అశాన్య విజ్ఞప్తి మేరకు ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఉగ్రవాద దాడుల్లో మరణించే పౌరులకు అమరవీరుల హోదా ఇవ్వవచ్చా? పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలు అప్పుడప్పుడూ మరణించిన పోలీస్ సిబ్బందిని లేదా పౌరులను గౌరవించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తాయి. అయితే జాతీయ స్థాయిలో ఈ ఉపయోగం చట్టబద్దంగా కాకుండా ఇంకా అలాగే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కూడా పౌరులను అమరవీరులుగా అధికారికంగా గుర్తించడం కూడా అరుదు. ఉదాహారణకు యునైటెడ్ స్టేట్స్ లో 9/11 దాడులలో మరణించిన పౌరులను ఉగ్రవాద బాధితులుగా గౌరవిస్తారు. కానీ చట్టబద్దంగా అమరవీరులుగా వర్గీకరించరు.
ఉగ్రవాద బాధితుల గుర్తింపు.. పరిహారం..
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఉగ్రవాద దాడుల్లో మరణించే పౌరులను ఉగ్రవాద బాధితులుగా గుర్తిస్తారు. వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా పరిహారానికి అర్హులు.
అయితే సైనిక సందర్భాలలో కూడా అధికారికంగా అమరవీరుల హోదా మంజూరు చేయడం లేదు. భావోద్వేగపరంగా శక్తివంతమైనది అయినప్పటికీ ఈ హోదా పౌరుల కోసం వర్గీకరించలేదు.
ధైర్యవంతులైన పౌరులను గౌరవించడానికి భారత్ ఒక అధికారిక వ్యవస్థను ప్రవేశపెట్టాలా వద్దా అనేది చర్చకు అర్హమైన అంశంగా మిగిలిపోయింది.
Tags:    

Similar News