వివేకా హత్య కేసులో ఇప్పుడేం జరుగుతుందీ? సీబీఐకి సుప్రీం ఆదేశాలేమిటీ?

వైఎస్ వివేకా హత్య కేసుపై దర్యాప్తు పూర్తి అయిందన్న సీబీఐ;

Update: 2025-08-05 06:02 GMT
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తయిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆగస్టు 5న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక వేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని కూడా సీబీఐ తెలిపింది. జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. వివేకా హత్యకేసుపై సీబీఐ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. మరోసారి విచారణ చేపడుతుందా లేదా అనేది ఇవాళ తెలుస్తుంది.

వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తుతో పలువురి బెయిళ్లు ముడిపడి ఉన్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సహా పలువురు బెయిల్ పిటిషన్లు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.
కేసు విచారణను పూర్తి చేసేందుకు సీబీఐకి ఇచ్చిన గడువును ఏప్రిల్ 30 నుంచి జూన్ 30 వరకు, ఆ తర్వాత ఆగస్టు మొదటి వారం వరకు సుప్రీంకోర్టు పొడిగించింది.
మరోవైపు, వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె డాక్టర్ నర్రా సునీత మొదటి నుంచి నిష్పక్షపాత విచారణ చేయాలని కోరుతున్నారు.
ఆ తర్వాత ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో జాప్యం జరుగుతుండడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ దర్యాప్తు కోసం కోర్టుకి వెళ్లారు. విచారణ సజావుగా సాగడం లేదంటూ కేసుని ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా కోరారు. చివరకు 2022 నవంబర్ 22న కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణపై మృతుడి కుమార్తె, భార్య అనుమానాల నేపథ్యంలో బదిలీకి అనుమతిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.
కడప ఎంపీగా అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్రపై విచారణ చేయించాలని కోరుతూ డాక్టర్ సునీత నేరుగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు కూడా చేశారు.
వివేకా హత్య కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?
వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు.
తొలుత ఆంధ్రప్రదేశ్ పోలీసులు తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టిన ఈ కేసు నాలుగేళ్లలో ఎన్నో మలుపులు తిరిగింది.
కేసు విచారణ కడప కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టు వరకూ వెళ్లింది. నిందితుల అరెస్టులు, కొందరు సాక్షులు మృతి చెందడం, ఇంకొందరు అఫ్రూవర్‌గా మారడం వంటివి జరిగాయి.
మాజీ ఎంపీగానే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కావడంతో వివేకా హత్య కేసు అధికార, విపక్షాల మధ్య ఆరోపణలకు, ప్రత్యారోపణలకు కేంద్ర స్థానంగా ఉంటోంది.
ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రిని కూడా ఈ కేసులో సీబీఐ విచారిస్తోంది. తొలుత 2023 జనవరి 28న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాశ్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు.
ఆ తరువాత కూడా అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారణకు పిలుస్తూనే ఉంది.
తన మీద సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హై కోర్టుకు కూడా వెళ్లారు.
హైకోర్టు ఆదేశాల మేరకు 2020 మార్చి 11న ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2023 ఫిబ్రవరి 20 వరకూ 248 మందిని విచారించింది. సాక్షులు, అనుమానితుల నుంచి వివరాలు సేకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది.
2025 ఆగస్టు 5న సీబీఐ వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి అయిందని సుప్రీంకోర్టుకు విన్నవించింది.
Tags:    

Similar News