యూట్యూబర్ రేవతి 'తిట్ల వీడియో' తెలంగాణ భవన్ లో రికార్డ్ చేశారా?

రేవతి అరెస్టుకు దారితీసిన పరిస్థితులు ఇవి...;

Update: 2025-03-13 03:02 GMT


 రైతు అంటూ ఒక వృద్ధుడి చేత సీఎం రేవంత్ రెడ్డిని తిట్టిస్తూ దానిని రైతు ఆవేదన అంటూ ఒక వీడియోని విడుదల చేసిన యుట్యూబర్ రేవతి, ఇలాంటి వీడియో సృష్టిలో ఆమెకు సహాయకురాలిగాపని చేసే మరొక యూట్యూబర్ సంధ్యను హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు అరెస్టు చేశాక ఆసక్తికరమయిన విషయాలు వెల్లడవుతున్నాయి.

ఆమెనుంచి సేకరించిన వివరాలను నగర పోలీసు అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అవి:

1.ఆ యుట్యూబర్ పేరు పొగడదండ రేవతి. మాదాపూర్ లో నివాసం. నానక్ రామూడలో 'పల్స్' పేరుతో యూట్యూబ్ చానల్ను నిర్వ హిస్తున్నారు. ఈమె కొత్తూరుకు చెందిన బండి సంధ్య అలి యాస్ తన్వీయాదవు తన వద్ద సహాయకురాలిగా ఉంటారు.

2. గత నెల తెలంగాణ భవన్లో ఈ వీడియోని రికార్డు చేశారు. ఎవరో వ్యక్తితో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయిస్తూ రికార్డ్ చేశారు.

3.. పల్స్ చానల్ ద్వారా ఈ వీడియోని వైరల్ చేయిం చారు.

4.అదికూడా అమెరికా నుంచి 'నిప్పుకోడి' హ్యాండిల్ తో ఈ వీడియోను పోస్టు చేశారు. ఇండియానుంచి చేస్తే ముప్పు ఉంటుందనిభావించి ఆమెరికా ‘నిప్పుకోడి’ని సృష్టించుకున్నారు.

5. దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఐటీ చట్టంలోని సెక్షన్లు 111, 61(2), బిఎన్ఎస్లోని 353(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

6.దీని మీద ప్రాథమిక దర్యాప్తు ప్రారం భించాక సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురిపై కేసు పెట్టారు.

7. ప్రధాన నిందితురాలి (ఎ1)గా పి రేవతి, ఏ2గా సంధ్య, పనిగా వీడియోలో సీఎం రేవంతు దుర్భాషలాడిన వృద్ధుడు, ఏ4గా కెమెరామన్, ఏ5 గా అమెరికా నుంచి ఎక్స్ పోస్టు చేసిన వ్యక్తిని నిందితులుగా ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు.

8. రేవతి, సంధ్యలను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. అమెరికాలో ఉన్న వ్యక్తిపై లుకౌట్ నోటీసు జారీ చేశారు.

9. రేవతికి బీఆర్ఎస్ నాయకులతో సంబంధాలున్నట్లు తమ దర్యాప్తులో తేలింది. ఈమెపై గతంలో రెండు కేసులున్నాయి.

10.రేవతి, సంధ్యను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఓ రైతు ఆవేదనను ప్రసారం చేస్తే కేసులు పెట్టడం అన్యాయమని, ‘జర్నలిస్టు’ ను వేధిస్తున్నారని నింది తుల తరపు న్యాయవాది వాదనలను వినిపించారు.

11.రేవంతు వ్యతి రేకంగా కుట్రపన్ని, ఈ నెల 10 నుంచి ఆ వీడియోను వ్యూహాత్మకంగా వైరల్ చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు.

12. తర్వాత కోర్టు రేవతి, సంధ్యలకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీ సులు వారిని చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.


Tags:    

Similar News