RRR | నా గుండెలపై గుద్దింది అతడే, రఘురామ కేసులో కీలక మలుపు

"నా గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించా, అతడి పేరు తెలియదు గనుక ఆనవాళ్లను పసిగట్టి చెప్పా" అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు;

Update: 2025-01-26 11:06 GMT
"నా గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించా, అతడి పేరు తెలియదు గనుక అతని ఆనవాళ్లను పసిగట్టి చెప్పా,ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుందని భావిస్తున్నా" అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు. (RRR CASE) సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ఆయన్ని అప్పట్లో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. సీఐడీ కస్టడీలో ఆయన్ని చిత్రహింసలకు గురిచేసి, అంతమొందించేందుకు యత్నించినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించి జనవరి 26 ఆదివారం గుంటూరు జిల్లా జైలులో నిందితుడి గుర్తింపు పరేడ్‌ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే పరేడ్‌ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో తులసి బాబు నిందితుడిగా ఉన్నారు.
పరేడ్‌ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం సమన్లతో కోర్టుకు వచ్చినట్లు చెప్పారు. ‘‘నా గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించా. తులసిబాబుకు కొందరు మద్దతివ్వడం అందరికీ తెలుసు. అతడికి, టీడీపీకి సంబంధం లేదని గుడివాడ వాసులు చెప్పారు. తులసిబాబు.. ఎస్పీ వద్దకు నేరుగా వెళ్లగల వ్యక్తి" అన్నారు రఘురామ కృష్టం రాజు. మరోవైపు ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్‌ పూర్వ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రభావతి కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ అప్పటి ఏఎస్పీ విజయ్‌పాల్‌ మాదిరి ప్రభావతి కూడా పెద్ద లాయర్లను పెట్టుకోవచ్చునని, అయినా వారికి సుప్రీం కోర్టులోనూ బెయిల్‌ రాదని అనుకుంటున్నానని చెప్పారు. ఈ కేసులో అప్పటి కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌నూ ప్రశ్నించాలని రఘురామ పేర్కొన్నారు.
రఘురామ కృష్ణంరాజు 2019లో వైసీపీ టికెట్ పై పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు సీటు నుంచి గెలిచారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ తో విభేదాలు వచ్చాయి. రఘురామ కృష్ణం రాజు వైసీపీ విమర్శలు చేస్తూ రోజుకో వీడియోను పెట్టేవారు. అంతర్గత వైరుధ్యాలతో రఘురామ కృష్ణంరాజు పై కేసు దాఖలైంది. సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నప్పుడు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ కృష్ణం రాజు ఆరోపించారు. ఆ సమయంలో ఓ బలమైన వ్యక్తి దాదాపు 120 కిలోలబరువున్న మనిషితన గుండెలపై కూర్చున్నారని ఆరోపించారు. ఆ వ్యక్తి ఈ తులసి బాబే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై జనవరి 26న నిందితుని గుర్తింపు ప్యారెడ్ గుంటూరులో జరిగింది.
Tags:    

Similar News