నిన్న డ్రగ్స్, నేడు లిక్కర్, ఆంధ్రప్రదేశ్ తీరు ఇది...

రాజ్య సభ మాజీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి వ్యాఖ్యలు;

Update: 2024-12-01 07:26 GMT
Andhra Pradesh Liquor Policy


ఆంధ్ర రాష్ట్రంలో మద్యం పాలసీ గాడి తప్పింది. మండలానికి 4 మద్యం షాపులు,40 బెల్టు షాపులు అన్న విధంగా తయారయింది. సాక్షాత్తూ హోమ్ మినిస్టర్ నియోజకవర్గమైన పాయకరావుపేట నియోజకవర్గం,S.రాయవరం మండలం,పేట సూది పురం అనబడే గ్రామం లో గురువారం బెల్టు షాపుకు దండోరా వేసి వేలం పాట నిర్వహించినట్లు దాసరి రమణ బాబు అనే వ్యక్తి రు 2 . 01 లక్షలకు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది శాంపుల్ మాత్రమే.రాష్ర్ట వ్యాప్తంగా అనేక చోట్ల బెల్టు షాపులున్నాయి.ఇంకా వస్తున్నాయి. వీటివల్ల రాబోవు రోజుల్లో మద్యం ఏరులై,సెల ఏరులై ప్రవహిస్తుంది. దీనిని బట్టి చూస్తే రాష్ట్రం మద్యాంధ్ర ప్రదేశ్ గానే కాదు,ఆటవిక,అరాచక ఆంధ్ర ప్రదేశ్ గా తయారవుతుందేమనని ఆందోళన కలుగుతూ ఉంది..

ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధిస్తానంటున్నాడు. కాని జరగుతున్నదేమిటి?

రాష్టంలో దొంగతనాలు,అత్యాచారాలు పెరిగిపోతాయి.బెల్ట్ షాపులు ప్రతిసందుకు రెండు మూడు వస్తున్నాయి

వికసిత ఆంధ్ర ప్రదేశ్ బదులు విధ్వంసక,వినాశకర ఆంధ్రప్రదేశ్ అవుతున్నదేమో అనిపిస్తున్నది..

బెల్టు షాపులు కట్టడి మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇప్పటిదాకా కేవలం ప్రకటనలు మాత్రం జోరుగా వచ్చాయి. బెల్ట్ షాపుల్లేవు, ఉండవు, ఉండనీయమని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నాడు. కానీ అది ఉత్తుత్తి ప్రసంగమేనా? మద్యంమీద చెక్ పెట్టాం. ఒకప్పుడు మీరు చూస్తే నాసికరం మందొచ్చేది. మీరు కర్నాటకకు పోయి మందు తాగే వాళ్లు. ఇపుడాబాధ లేదు. ఇక్కడే స్వేచ్ఛంగా తాగే విధంగా, కర్నాటక తో సమానంగా, నాసి రకం కాకుండా కర్నాటక మాదిరి మంచి మందు సరఫరా చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు జాగ్రత్త తీసుకున్నాం....అంతేకాదు, ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే, నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నా,”అని ముఖ్యమంత్రి అన్నాడు. తీరా వార్తలు చూస్తే, ఆయన చెప్పింది ఒక పక్కకు పోయింది. మరొక పక్క నుంచి బెల్ట్ షాపులొస్తున్నాయి. అయితే,ప్రత్యేక టాస్క్ ఫోర్స్ హర్షణీయం. 

కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి


 వైకాపా కాలంలో డ్రగ్గాంధ్ర గా మారింది

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ( వైకాపా) పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్గాంధ్ర ప్రదేశ్ గా తయారయింది. గంజాయి,డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ లభించేవి.చివరకు కొందరు పాఠశాల విద్యార్థులు కూడా వీటికి బానిసలయ్యారు.

వీటిని కట్టడి చేసేందుకు ఇపుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షణీయం. దానిని కచ్చితంగా అమలు చేస్తే ప్రజలు సంతోషిస్తారు.


Tags:    

Similar News