సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావడానికి ఎదురుచూస్తున్నా..

ప్రధాని మోదీ ట్వీట్.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-18 15:43 GMT
పుట్టపర్తిలో సత్యాసాయిబాబాతో నరేంద్రమోదీ (ఫైల్)

పుట్టపర్తికి బయలుదేరే క్షణం కోసం నిరీక్షిస్తున్నా. రేపు (నవంబర్ 19వ తేదీ) జరగబోయే సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావడానికి ఎదురుచూస్తున్నా అని ప్రధాని నరేంద్రమోదీ తన మనసులోని మాటలను వ్యక్తం చేశారు. గతంలో పుట్టపర్తిని సందర్శించడం, సత్యసాయిని కలవడం, ఆశీర్వచనాలు తీసుకున్న మధుర క్షణాలు మదిలో నిండుగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గత జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు.


పుట్టపర్తిలో సత్యాసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలలో పాల్గోనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీ పుట్టపర్తికి రానున్నారు. ఆ క్షణాలను గుర్తు చేసుకుంటే, ట్విట్టర్ వేదికగా ఆయన తన మదిలో భావాలను వ్యక్తం చేశారు.

"పుట్టపర్తి సత్యసాయిబాబు జీవితం, సమాజ సేవకులో అచంచల నిబ్ధత, ఆధ్యాత్మిక విలువలతో సమాజానికి మార్గదర్శకం అందించారు. సత్యసాయి అనుసరించిన తీరు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది" ప్రధాని నరేంద్ర మోదీ తన స్పందనను వ్యక్తం చేశారు.
పుట్టపర్తిని నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో సందర్శించారు. ఆ సమయంలో సత్యాసాయికి దగ్గరగా ఫోటోలు దిగడం, ఆయనతో సంభాషించి, ఆశీర్వచనాలు తీసుకున్న రోజులను నరేంద్రమోదీ తన ట్విట్టర్ ఖాతాలో ప్రస్తావించారు.

"ఆ రోజుల్లో సత్యసాయిబాబాతో అనేక సందర్భాల్లో కలుసుకునే అదృష్టం నాకు దక్కింది" అని కూడా ప్రధానిమోదీ భావోద్వేగంతో కూడిన సందేశం వెల్లడించారు. సత్యసాయి మాటలు, ఉపదేశాలు, మానవతా విలువలు నా మనసులో వెలుగులు నింపాయి అని కూడా ప్రధాని మోదీ తన మనసులోని భావాలు వ్యక్తం చేశారు.
పుట్టపర్తిని సందర్శించిన సందర్భంలో సత్యసాయితో కలిసి తీయించుకున్న ఫొటోలు ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

రేపు ఉదయం రానున్న ప్రధాని
పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ 19వ తేదీ (బుధవారం) ఉదయం ఎనిమిది గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ ఈపాటికే పుట్టపర్తికి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్ వారంతా ప్రశాంతి నిలయానికి చేరుకుంటారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో జయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయిబాబా మహా సమాధిని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దర్శించుకుంటారు. ఆ తరువాత స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే ప్రధాని మోదీ సత్యసాయి స్మారకంగా తయారు చేసిన వంద రూపాయల నాణెం, తపాలా బిళ్లను కూడా ఆవిష్కరించనున్నారు.
Tags:    

Similar News