పేర్ని నాని కేసులో మరో ట్విస్ట్
అధికారులు ఆందోళనలకు గురవుతున్నారు. తమ మెడకు చుట్టుకుంటేందేమో అని వణికి పోతున్నారు.;
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు పేర్ని నాని భార్య మీద నమోదైన రేషన్ బియ్యం మాయం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ మేనేజర్ మానస తేజను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో అడుగు ముందుకేశారు. మానస తేజను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మరో తాజాగా ఆశ్చర్యకరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. జిల్లా మేనేజర్‌నే అదుపులోకి తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ కృష్ణా జిల్లా మేనేజర్ కోటి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పౌరసరఫరాల శాఖలో ఒక్క సారిగా కలకలం రేగింది. ఈ కేసు తమపైకి కూడా వస్తుందేమనని వణికి పోతున్నారు. పేర్ని నాని కుటంబానికి చెందిన గోడౌన్‌లో మాయమైన రేషన్ బియ్యం కేసులో జిల్లా మేనేజర్ కోటి రెడ్డికి కూడా ప్రమేయం ఉందని పోలుసులు అనుమానిస్తున్నారు. అయితే గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమయ్యాయని ఫిర్యాదు చేసిందే ఈ కోటి రెడ్డి. అయితే ఆయన్నే అరెస్టు చేయడం ఇప్పుడు ఆ శాఖలో కలకలం రేపుతోంది. తమపై కూడా కేసులు నమోదు చేస్తారేమో అని కలవరం చెందుతున్నారు. సోమవారం మానస, కోటిరెడ్డిలను అరెస్టు చూపించే అవకాశం ఉంది. మరో వైపు మచిలీపట్నం జిల్లా కోర్టులో సోమవారం ఇదే కేసుపై వాదనలు ఉన్నాయి. పేర్ని జయసుధ ముందస్తు బెయిల్‌పై తుది తీర్పును వెలువరించనుంది.