మార్చి17 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి లోకేష్‌ విడుదల చేశారు.;

Update: 2024-12-11 13:56 GMT

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. మార్చి 17 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి నెలాఖరు వరకు అంటే మార్చి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహంచనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆ మేరకు పదో తరగతి షెడ్యూల్‌ను మంత్రి నారా లోకేష్‌ బుధవారం విడుదల చేశారు. రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకున్నామని, ఇదే సమయంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు.

టైం టేబుల్ ిఇదే 

Delete Edit





Tags:    

Similar News