మహిళా కోర్టు ఉరిశిక్ష విధించింది..సుప్రీం కోర్టు కొట్టేసింది

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిచింది సుప్రీం కోర్టు.;

Update: 2025-01-29 05:48 GMT

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ మీద ముంబాయిలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఆ యువతిని అతికిరాతకంగా అంతమొందించాడని పోలీసులు నిర్థారించారు. దీని మీద న్యాయ విచారణ చేపట్టిన ముంబాయిలోని మహిళా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి, ఉరి శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. దీనిని ముంబాయి హైకోర్టులో నిందితుడు సవాల్‌ చేశాడు. నిందితుడి పిటీషన్‌ను ముంబాయి హైకోర్టు కొట్టేసింది. నిందితుడికి మహిళా ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణ శిక్ష సరైనదే అని సమర్థించింది. దేశంలో మహిళలపై హింస పెరుగుతున్న నేపథ్యంలో నిందితుడికి మరణ శిక్ష సరైనదే అని సమర్థిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అయితే నిందితుడు దీనిపై సుప్రీం కోర్టులో సవాల్‌ చేశాడు. సుప్రీం కోర్టు కూడా కింది కోర్టులు విధించిన శిక్షను సమర్థిస్తుందని, బాధితురాలికి న్యాయం జరుగుతుందని భావించారు. అయితే అందుకు భిన్నంగా సుప్రీం కోర్టు తీర్పును వెలువరించి ఆశ్యరానికి గురిచేసింది. ఈ కేసుపైన మంగళవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నిందితుడికి కింద కోర్టులు విధించిన మరణ శిక్షను కొట్టేస్తూ.. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఎస్తేర్‌ అనూహ్య ముంబాయిలోని అంధేరి ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్‌ అయింది. గత కొన్ని సంవత్సరాలుగా అదే కంపెనీలోనే జాబ్‌ చేస్తోంది. అయితే క్రిస్మస్‌ సందర్భంగా సొంతూరు వెళ్లాలని, తమ కుటుంబ సభ్యులతో పండుగ పర్వదినం జరుపుకోవాలని ఆశ పడింది. దీంతో 2013 డిసెంబర్‌లో ఎస్తేర్‌ అనూహ్య క్రిస్మస్‌ సెలవుల్లో మచిలీపట్నం వెళ్లింది.
అందరితో సరదాగా గడిపిన తర్వాత తిరిగి ముంబాయికి బయలుదేరింది. 2014, జనవరి4న విజయవాడ రైల్వే స్టేషన్‌ లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి ముంబాయికి బయలుదేరింది. కుమార్తె ఎస్తేర్‌ అనూహ్యకు సెండాఫ్‌ ఇచ్చేందుకు తండ్రి సింగవరపు జోనాథన్‌ సురేంద్రప్రసాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. కుమార్తెను రైలు ఎక్కించిన తండ్రి అదే రోజు అర్ధరాత్రి అనూహ్యతో ఫోన్‌లో మాట్లాడారు. అయితే ఆ సమయంలో తన సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ అయిపోయిందని, ముంబాయి చేరుకున్న తర్వాత ఫోన్‌ చేస్తానని కుమార్తె అనూహ్య తండ్రికి చెప్పింది. అలా చెప్పిన కుమార్తె అనూహ్య తర్వాత తన ఫోన్‌ నుంచి తండ్రికి కాల్స్‌ రాలేదు. ఎంత ట్రై చేసినా అనూహ్య నుంచి సమాచారం లభించ లేదు. మరో వైపు అనూహ్య ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయినట్లు సమచారం వస్తోంది. దీంతో అనూహ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో తండ్రి జోనాథన్‌ ముంబాయికి బయలు దేరారు.
సీన్‌ కట్‌ చేస్తే..
2014 జనవరి 5న తెల్లవారు జామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో చంద్రభాన్‌ అనే వ్యక్తి దొంగతనం చేసేందుకు ముంబాయిలోని లోక్‌మాన్య తిలక్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అదును చూసి దొంగతన చేసేందుకు తచ్చాడుతున్నాడు. అదే రైల్వే స్టేషన్‌లో ఉన్న ఎస్తేర్‌ అనూహ్యపై ఈ దుర్మార్గుడి కన్ను పడింది. దొంగతనం చేయాలనే ఆలోచనలను విరమించుడుకున్నారు. అనూహ్యపై అత్యాచారం చేయాలనే దుర్మార్గపు నిర్ణయానికి వచ్చాడు. దీని కోసం ట్యాక్సీ డ్రైవర్‌ అవతారమెత్తాడు. అనూహ్య వద్దకు వెళ్లి తాను ట్యాక్సీ డ్రైవర్‌నని చెప్పుకొని రూ.300లకే అంధేరిలోని తన హాస్టల్‌ వద్దకు తీసుకెళ్తానని ఆమెను నమ్మించించాడు. అతనిని నమ్మిన అనూహ్య ట్యాక్సీ ఎక్కేందుకు బయటకు వచ్చింది. అయితే బయట ఆ దుర్మార్గుడు చెప్పినట్టు ట్యాక్సీ కనిపించలేదు. ఇదే అదునుగా భావించిన చంద్రభాన్‌ అనూహ్యను బలవంతంగా ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్నాడు. అనూహ్య ఉండే అంధేరి ప్రాంతానికి కూకుండా చంద్రభాన్‌ నివాసం ఉండే కార్వేనగర్‌కు కాస్త దూరంలో ఉండే ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బలత్కరిస్తుండగా తనను వదిలేయాలని అతని కాళ్లా వేళ్లా పడింది అనూహ్య. ఎంత వేడుకున్నా ఆమెను వదిలిపెట్ట లేదు. అత్యంత క్రూరంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత అనూహ్యను హతమార్చాడు. అనూహ్య మృతదేహం మీద పెట్రోల్‌ పోసి అగ్గి పెట్టాడు. దీంతో అనూహ్య బాడీ చాలా వరకు కాలిపోయి గుర్తు పట్టలేని విధంగా మారింది.
తన కుమార్తె ఎస్తేరు అనూహ్య నుంచి ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేకపోవడం, ఫోన్‌ స్విచాఫ్‌ ఉండటంతో ఆమె తండ్రి జోనాథన్‌ ముంబాయికి బయలుదేరి వెళ్లాడు. ముంబయిలోని లోక్‌మాన్య తిలక్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు బృందాలు గాలింపులు చేపట్టారు. అందులో భాగంగా రైల్వేస్టేషన్‌తో పాటు చుట్టుపక్కల అందుబాటులో ఉన్న అన్ని సీసీ టీవీల ఫుటేజీని పరిశీలించారు.
పోలీసులు చేపట్టిన గాలింపుల్లో కంజూర్‌మార్గ్‌ నిర్మానుష్య ప్రాంతంలో 2014 జనవరి 16న సగం కాలిపోయిన ఓ యువతి మృతదేహం లభ్యమైంది. పరీక్షలన్ని చేసిన తర్వాత అనూహ్య మృతదేహంగా దీనిని నిర్థారించారు. ఇదే సమయంలో నిందితుడు చంద్రభాను సనవ్‌పై పోలీసులు నిఘా పెట్టారు. కార్వేలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చిన చంద్రభానును అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. నేరానికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారు. విచారణ చేపట్టిన ముంబయి ప్రత్యేక మహిళా న్యాయస్థానం నిందితుడు చంద్రభాను సనవ్‌ను దోషిగా నిర్థారించింది. 2015లో ముంబాయి మహిళా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి మరణ శిక్షను విధించింది. 2018లో కింది కోర్టు విధించిన మరణ శిక్షను సమర్థిస్తూ ముంబాయి హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
దీనిని సవాల్‌ చేస్తూ నిందితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తాజాగా దీనిపైన సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని త్రి సభ్య ధర్మాసనం దీనిపైన మంగళవారం విచారణ చేపట్టింది. నిందితుడు చంద్రభాను సనవే ఈ హత్య చేశాడని ప్రొసిక్యూషన్‌ నిరూపించలేక పోయిందని వ్యాఖ్యానించిన ధర్మాసనం, నిందితుడు చంద్రభాను సనవ్‌ను నిర్దోషిగా తేల్చుతూ తీర్పును వెలువరించింది.
Tags:    

Similar News