మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్,సభ్యుల నియామకానికి ధరఖాస్తులు ఆహ్వానం
ధరఖాస్తులకు డిసెంబరు 11 చివరి తేది. మునుపటి నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్, సభ్యుల నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు చైర్‌పర్సన్‌తో పాటు ఇతర సభ్యుల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) ఎస్ సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చట్టం 1993 సెక్షన్ 21లోని సబ్ సెక్షన్ 2 ప్రకారం కమిషన్ చైర్ పర్సన్‌గా ధరఖాస్తు చేయాలనుకునే వారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా న్యాయమూర్తిగా పని చేసి ఉండాలని తెలిపారు. అలాగే మానవ హక్కుల కమిషన్ సభ్యులు(జుడీషియల్)గా ధరఖాస్తు చేసే వారు హైకోర్టు న్యాయమూర్తిగాను లేదా రాష్ట్రంలో జిల్లా న్యాయమూర్తిగా కనీసం 7 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు. నాన్ జుడీషియల్ సభ్యుడు నియామకానికి మానవ హక్కులకు సంబంధించిన విషయాలలో పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుందన్నారు.