CM CHANDRA BABU | 'కుప్పం'లో అభివృద్ధి బీజాలపై బాబు ఫోకస్

సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగుతుంది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-06 02:52 GMT

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండోసారి సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజులపాటు ఆయన ఇక్కడే మకాం వేయనున్నారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. పైలట్ ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు.

సీఎం పర్యటన ఇలా..
కుప్పంలో సీఎం ఎన్. చంద్రబాబు రెండు రోజుల పర్యటన ఇలా సాగుతుంది.
10.20 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
11.15 గంటలకు బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి
11.50 గంటలకు కుప్పం సమీపంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో దిగుతారు.
11.50 నుంచి 11.55 గంటల వరకు పార్టీ ప్రముఖులు, అధికారుల స్వాగతం, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు.
మధ్యాహ్నం
12:00 గంటలకు ద్రవిడ వర్శిటీలోని ఆడిటోరియం చేరుకుంటారు.
01:15 గంటల వరకు స్వర్ణకుప్పం విజన్ - 2029 ప్రారంభిస్తారు. కుప్పంను అభివృద్ధిలో తీర్చదిద్దే కార్యాచరణ వివరిస్తారు. దీనిపై చర్చలు. ప్రశ్నలు-సమాధానాలు చెప్పడం ద్వారా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
01:15 నుంచి 02:00 గంటల వరకు రిజర్వు చేశారు.
02:25 గంటలకు కుప్పం మండలం నడిమూరు గ్రామానికి చేరుకుంటారు.
03:45 గంటల వరకు సోలారైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. లబ్ధిదారులతో మాటామంతీ.
04:00 గంటకు సీగలపల్లెకు చేరుకుంటారు.
05:20 వరకు గ్రామంలో ఉంటూ, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులతో ముఖాముఖితో పాటు నేచురల్ ఫార్మింగ్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసి, ఎన్ఓసీఎల్ తో ఒప్పంద పత్రాలు మార్చుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి
05:55 గంటలకు ద్రవిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియంకు చేరుకుంటారు.
06:00 గంటల నుంచి 07:45 వరకు మీటింగ్ అనంతరం
07:55 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుంటారు.
రాత్రికి అక్కడే బస చేస్తారు.
రెండో రోజు..
ఏడవ తేదీ కూడా సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్ ఖరారు చేశారు.
ఉదయం 10:00 గంటలకు ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి బయలుదేరి
10:05 గంటకు కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు.
12:05 గంటల వరకు జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు.
12:05 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి
12:20 గంటలకు కంగుంది గ్రామానికి చేరుకుంటారు. అక్కడి దివంగత శ్యామన్న విగ్రహావిష్కరణ చేస్తారు.
మధ్యాహ్నం 01:00 గంటకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి
01:20 గంటలకు ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు చేరుకుంటారు. అప్పటి నుంచి
02:00 గంటల వరకు రిజర్వు చేశారు.
ఆ తరువాత
04:30 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
04:50 గంటల వరకు రిజర్వు
05:05 గంటలకు శాంతిపురం మండలం కడపల్లెకు చేరుకుంటారు.
05:50 గంటల వరకు అక్కడ నిర్మాణంలో ఉన్న తన నివాసాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. ఆ తరువాత బయలుదేరి
06:10 గంటలకు ద్రవిడ విశ్వవిద్యాలయం వద్దకు చేరుకుని, అకడమిక్ భవన్ ప్రారంభం తోపాటు 1ఎం1బీ (కెరియర్ రీడ్నెస్ సెంటర్) భవనం కూడా ప్రారంభిస్తారు.
06:30 నుంచి 07:30 గంటల వరకు అధికారులతో సమీక్ష.
07:30 గంటలకు బయలుదేరి
07:45 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహానికి చేరుకుంటారు.
Tags:    

Similar News