బెయిల్ మంజూరు చేసి షరతులు విధించింది
సాక్షులను బెదిరించకూడదు. ఆధారాలను ధ్వంసం చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది.;
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏపీ ఫైబర్‌నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే కొన్ని షరతులు కూడా విధించింది. దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని, సాక్షులను బెదిరించడం కానీ, కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడం వంటి పనులకు పూనుకోకూడదని ఆదేశించింది. ఆ మేరకు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ సుప్రీం కోర్టు ధర్మాసనం గౌతమ్ రెడ్డి కేసులో తీర్పును వెలువరించింది. గౌతమ్‌రెడ్డి తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్‌లు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం దాడి చేసిన వ్యక్తే బెయిల్‌పై ఉన్నప్పుడు ఆ దాడికి కుట్ర చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్‌రెడ్డి కూడా విచారించాలి కదా అని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన నిందితులు కూడా బెయిల్‌పైనే ఉన్నారు, ఈ కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదు, ఈ కుట్రను విచారణలో తేల్చండని పేర్కొంది.