అబద్ధాలు చెప్పాలని చంద్రబాబే చెబుతారు
ఎవరైన తల్లిదండ్రులు తమ పిల్లలకు అబద్ధాలు చెప్పకూడదని, నిజాయితీ, నీతిగా బతకాలని చెబుతారు. కానీ చంద్రబాబు అలా కాదని జగన్ అన్నారు.;
మనం మన పిల్లకు ఏమి చెబుతాం.. ఏమి నేర్పుతాం. అబద్ధం ఆడకూడదు. దొంగతనం చేయకూడదు. మోసం చేయకూడదు. విలువలతో బతకాలి అని చెబుతాం. పాఠశాలల్లో కూడా ఇదే చెబుతారు. కానీ చంద్రబాబు తీరే వేరు. అబద్ధాలు చెప్పు. స్వార్థం కోసం పని చేయి. మోసం చేయి.. వెన్నుపోటు పొడువు.. సొంత మామనే మోసం చేయి అని చెప్పి నేర్పించే వ్యక్తి చంద్రబాబు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అబద్దాలు తప్ప నిజాలు చెప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అది చంద్రబాబే అని జగన్ ఎద్దేవా చేశారు. దానికి ఇటీవల ఢిల్లీలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను కలిసిన సందర్భంలో కూడా అబద్దాలు చెప్పారని విమర్శించారు. ఈ సారి దావోస్ పర్యటనలో ఒక ఎమ్మోవోయు కూడా చేసుకోలేక పోయారు. పెట్టుబడులు పెడుతామని జిందాల్ వస్తే వారిపైన కేసులు పెట్టి భయపెట్టి వెళ్లగొట్టారుని మండిపడ్డారు.