బాలయ్య.. భువనేశ్వరి మధ్య నలిగి పోతున్నా

బాలయ్య నా కంటే నాలుగేళ్లు సీనియర్‌. ఎంత ఎమోషనల్‌గా ఉంటారో.. అంత మంచి మనిషి అంటూ చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు.;

Update: 2025-02-02 09:21 GMT

సహజంగా సీఎం చంద్రబాబు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు. ఆయన ఫేస్‌లో ఎప్పుడూ స్మైల్‌ కనిపించదు. పార్టీ సమావేశాల్లో కానీ, ప్రభుత్వ కార్యకమాల్లో కానీ సీరియస్‌గానే కనిపిస్తుంటారు. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బిహేవియర్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించని రీతిలో మెజారిటీ సీట్లు సాధించడం, నాలుగో సారి ముఖ్యమంత్రి పీఠమెక్కడంతో ఆయన ముఖంపై చిరునవ్వు వచ్చి చేరింది. హావ భావాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మీడియా సమావేశాల్లో సైతం అప్పుడప్పుడు జోక్‌లేస్తూ నవించడం కూడా చేస్తున్నారు.

బాలయ్య కార్యక్రమంలో ఇది కాస్త పెరిగింది. అన్‌స్టాపబుల్‌ కార్యక్రమంలో అటు బావమరిది బాలయ్య మీద, ఇటు తన భార్య భువనేశ్వరి మీద జోక్‌లేసి నవ్వు వాతావరణం క్రియేట్‌ చేశారు. ఇదే వాతావరణం ఆదివారం హైదరబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నెలకొంది.
ఒక పక్క బావమరి బాలయ్య.. మరోపక్కన పవర్‌పుల్‌ భార్య భువనేశ్వరి.. ఇద్దరి మధ్య ఇప్పుడు నేను నలిగిపోతున్నా అంటూ నవ్వుతూ సరదాగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు మాటలు ఆ కార్యక్రమానికి వచ్చిన సభికులందరనీ నవ్వుల్లో ముంచెత్తింది. సినీ హీరో, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణకు అభినందనలు తెలుపుతూ ఆయన సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు సరదాగా మాట్లాడారు.
తాను 1978లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాను. బాలకృష్ణ 1974లో సినిమాల్లోకి వచ్చారు. ఈ లెక్కన చూస్తే బాలయ్య నాకంటే నాలుగేళ్ల సీనియర్‌ అంటూ కితాబిచ్చారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి బాధ్యతలను చేపట్టిన తర్వాత, బాలకృష్ణ పర్యవేణలో దేశంలోనే బసవతారకం ఒక గొప్ప ఆస్పత్రిగా పేరు గడించిందింటూ బాలయ్య పరిపాలన స్కిల్స్‌ను చంద్రబాబు మెచ్చుకున్నారు. బాలయ్య ఎంత ఎమోషనల్‌గా ఉంటారో.. అంత మంచి మనిషి అని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబ, బాలయ్య లాంటి వ్యక్తి తనకు బావమరిదిగా దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నారని సభా ముఖంగా చంద్రబాబు వెల్లడించారు. అయితే ఇక్కడే చంద్రబాబు పప్పులో కాలేశారు. బాలయ్యతో పాటు సీనియర్‌ రామకృష్ణ, జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహన్‌కృష్ణ, జూ.రామకృష్ణ, జయశంకర్‌ కృష్ణలు కూడా చంద్రబాబుకు బావమరుదులే. వీరిందరినీ కాదని ఒక్క బాలయ్య వంటి బావమరిది దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశంగా మారింది. బాలయ్య మంచి బావమరి అయితే తక్కిన వాళ్ల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News