కాంగ్రెస్ తుది జాబితా వచ్చేసింది..

కాంగ్రెస్ పార్టీ తమ ఆంధ్ర అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఇటీవల పది మంది అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్ తాజాగా మరో ఐదుగురిని మార్చింది.

Update: 2024-04-24 15:39 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్ర ఎన్నికల్లో తమ పార్టీ తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు ఎంపీ, 11 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 22న విడుదల చేసిన జాబితాలో 10 మంది అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్ ఈరోజు ప్రకటించిన జాబితాలో ఐదుగురు అభ్యర్థులను మార్చింది. ఈ జాబితానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ విడుదల చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ.. చీపురపల్లి, విజయవాడ ఈస్ట్, కొండపి, తెనాలి, మార్కాపురం అభ్యర్థులను మార్చింది. అయితే రేపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుండటంతో వీరు ఎప్పుడు నామినేసన్లు వేస్తారు.. అసలు కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఎంటనేది కీలకంగా మారింది.

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా

మార్కాపురం (సయ్యద్‌ సావేద్‌ అన్వర్‌

కర్నూలు - షేక్‌ జిలాని బాషా

సత్తెనపల్లి - చంద్ర పాల్‌ చుక్క

కొండపి (ఎస్సీ) - పసుమర్తి సుధాకర్‌

ఎమ్మిగనూరు - మారుముళ్ల ఖాసీం వలీ

మంత్రాలయం - పీఎస్‌ మురళీకృష్ణరాజు

తెనాలి - చందు సాంబశివుడు

బాపట్ల -గంటా అంజిబాబు

చీపురుపల్లి -ఆదినారాయణ జమ్ము

శృంగవరపుకోట -గేదెల తిరుపతి

విజయవాడ తూర్పు - పొనుగుపాటి నాంచారయ్య

అసెంబ్లీ అభ్యర్థులు వీరే

చిత్తూరు (ఎస్సీ)- ఎం.జగపతి

నర్సాపురం - కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడు (కేబీఆర్‌ నాయుడు)

రాజంపేట - షేక్‌ బషీద్‌

Tags:    

Similar News