కానిస్టేబుల్ సుబ్బారావును ఆ కుర్రాడు కిడ్నాప్ చేశాడా?

లబోదిబోమంటున్న కుటుంబసభ్యులు, నడుంబిగించిన పోలీసులుv;

Update: 2025-08-31 06:42 GMT
AI Graphic
అయ్యో.. కానిస్టేబుల్ సుబ్బారావుకే దిక్కు లేకుండా పోయిందా!! పాపం, ఎక్కడున్నాడో, ఏమి చేస్తున్నాడో.. ఆచూకీ తెలియక 48 గంటలైంది. డిపార్ట్మెంట్ వాళ్లేమో పరువు పోతుందేమోనని గుట్టుచప్పుడు కాకుండా గమ్మునుండి పోయారు. కుటుంబసభ్యులేమో లబోదిబోమంటున్నారు. అసలింతకీ విషయమేమిటంటే..
ఈ సుబ్బారావు ఉండేది కామవరపుకోట. పని చేసేది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్. రెండు రోజుల నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆయన పని చేసే పోలీసుస్టేషన్ లో కాకుండా తడికలపూడి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశఆరు. ఇప్పుడీ సంఘటన ఏలూరు జిల్లాలో కలకలం రేపుతోంది. మామూలుగా పోలీసులు ఇతరుల్ని మాయం చేస్తారని నానుడి. అలాంటిది ఓ కానిస్టేబుల్‌ అదృశ్యం (Constable Missing) ఆంధ్రాలో సంచలనం సృష్టించింది.
బి.సుబ్బారావు కానిస్టేబుల్ జంగారెడ్డిగూడెం డివిజన్‌ కామవరపుకోట, టి.నరసాపురం పోలీస్‌స్టేషన్ల పరిధిలో స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ)లో పని చేస్తున్నారు. రెండేళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు. సమీపంలోని కామవరపుకోటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. శుక్రవారం బుట్టాయగూడెం నుంచి వచ్చి ఆరోజు రాత్రి డ్యూటీ చేశారు. ఆ తర్వాత ఇంతవరకు అజా అయిపు లేదు. సుబ్బారావు ఫోన్‌ సిగ్నల్‌ అందడం లేదని సమాధానం వస్తోంది.
దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతూ శనివారం సాయంత్రం కామవరపుకోట మండలం తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా కామవరపుకోటలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సుబ్బారావు ఫోన్‌ సిగ్నల్‌ ఆగిపోయిన ప్రాంతాలతో పాటు టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
కామవరపు కోట కుర్రాడు ఈ కానిస్టేబుల్ ను ఏమైనా కిడ్నాప్ చేశారా లేక ఇంకేమైనా లోగుట్టు ఉందా అని ఆరా తీస్తున్నారు. ఏ విషయం సాయంత్రం లోగా తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు.
Tags:    

Similar News