నాలుగు గంటల్లోనే ఫలితాలు..!
ఆంధ్ర ఎన్నికల లెక్కింపుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్ని నియోజకవర్గాల్లో పకడ్బందీగా..
ఆంధ్ర ఎన్నికల లెక్కింపుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్ని నియోజకవర్గాల్లో పకడ్బందీగా ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్సమక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. కౌంటింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఉదయం ఎనిమిది గంటలకు అనుకున్న విధంగా కౌంటింగ్ ప్రారంభమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన వివరించారు.
పెరుగుతున్న ఉత్కంఠ
ఆంధ్ర ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎవరు గెలుస్తారన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా భారీ చర్చలు కూడా జరుగుతున్నాయి. మేధావులు సైతం ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. తమతమ వాదలను జస్టిఫై కూడా చేసుకుంటున్నారు. ఆఖరికి ప్రజల్లో కూడా ఎవరు విజేత అవుతారు అన్నదానిపై ఒక అంచనా లేకుండా పోయింది. ఎన్నడూ లేనంత స్తబ్దుగా ఈ ఎన్నికల్లో ప్రజలు వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీలు అయితే గెలుపు తమదంటే తమదంటూ డండోరా వేసుుకుంటున్నాయి. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా ఈసారి ఆంధ్ర ప్రజలు అనుభవం, అభివృద్ధికి ఓటేశారని, విజయం తమదేనంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంతలో కౌంటింగ్ డేట్ కూడా దగ్గర పడుతోంది.
మధ్యాహ్నం కల్లా అన్ని ఫలితాలు
ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ను ప్రారంభించడానికి ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. దానికి తోడు ఈసారి ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధిక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నమోదు కావడంతో కౌంటింగ్ టేబుళ్ల సంఖ్యను ఈసీ పెంచింది. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల చొప్పున కౌంటింగ్ నిర్వహించాలని, తద్వారా మధ్యాహ్నాం 2గంటల కల్లా ఆయా నియోజకవర్గాల ఫలితాలు వెల్లడించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఎన్నికల సంఘం. మరో 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించి సాయంత్రం 4 గంటల కల్లా కౌంటింగ్ ముగించడానికి ఈసీ సిద్ధమైంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో మాత్రం 25కు పైగా రౌండ్ల కౌంటింగ్ నిర్వహించి సాయంత్రం 6 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులకు సూచించింది. మొత్తానికి 175 నియోజకవర్గాల ఫలితాలు రాత్రి 8 నుంచి 9 గంటలకు వెలవడేలా ఏర్పాట్లు చేయాలని తెలిపింది.
ఆ నియోజకవర్గమే నెం.1
కౌంటింగ్ డేట్ దగ్గర పడిన నేపథ్యంలో ఏ నియోజకవర్గ ఫలితాలు ఎంత సేపటిలో తేలతాయి అన్న విషయంపై కూడా రాజకీయ వర్గాలతో పాటు అన్ని రంగాల్లోనూ హాట్‌టాపిక్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ముగించుకుని ఫలితాలు వెలువడే తొలి నియోజకవర్గంగా నందిగామ, పామర్రు నిలువనున్నటలు ఈసీ అంచనా వేస్తోంది. ఈ నియోజకవర్గాల్లో మధ్యాహ్నాం 12 గంటలకే విడుదల కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నందిగామలో 11 మంది అభ్యర్థులు మాత్రమే పోటీ ఉండటం వల్లే ముందుగా ఈ నియోజకవర్గ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నయని అధికారులు వివరిస్తున్నారు. అదే విధంగా పామర్రు నియోజకవర్గంలో కేవలం 8 మంది అభ్యర్థులు మాత్రం ఎన్నికల బరిలో ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గం ఫలితాలు కూడా ముందుగానే వస్తాయి అంచనా వేస్తున్నారు.