మాజీ సమాచార కమిషనర్ విజయబాబుకు హైకోర్టు రూ.50వేల జరిమానా!

మాజీ సమాచార కమిషనర్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు పి. విజయబాబుకు రాష్ట్ర హైకోర్టు భారీ జరిమానా విధించింది.

Update: 2024-11-28 15:45 GMT
మాజీ సమాచార కమిషనర్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు పి. విజయబాబుకు రాష్ట్ర హైకోర్టు భారీ జరిమానా విధించింది. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారమై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ఉద్దేశంతో పిటిషన్‌ వేశారని పేర్కొంది. విజయ బాబుకు రూ.50వేల జరిమానా విధించింది. నెల రోజుల్లో లీగల్‌ సర్వీస్‌ అథారిటీలో రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీకి మద్దతుగా మద్దతుగా విజయ బాబు ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వైసీపీ తరఫున ఆయన టీవీ చర్చల్లో పాల్గొంటుంటారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమం వేదికగా 2 వేల మంది దూషణలు చేస్తూ, అసభ్యకర పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పెలా అవుతుందని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ఒకే ఉద్దేశంతో వందల మంది అభ్యంతరకర పోస్టులు పెడుతుంటే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుందని నిలదీసింది. ఒకే పద్ధతిలో కేసులు పెడుతోంది పోలీసులు కాదని, సోషల్‌ మీడియాలోనే ఒకే విధానంలో దురుద్దేశంతో పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది, వైసీపీ సర్కార్ హయాంలో అటార్నీ జనరల్ గా పని చేసిన ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయ బాబు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పని చేశారు.
Tags:    

Similar News