జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి

వైసీపీ నుంచి బయటకు వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో బాహాబాహీకి తలపడే సూచనలే కనిపిస్తున్నాయి;

Update: 2025-02-07 06:56 GMT
YS JAGAN & Vijaya sai Reddy
వైసీపీ నుంచి బయటకు వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో బాహాబాహీకి తలపడే సూచనలే కనిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి పిరికివాడు, ఎవరికో భయపడి రాజీనామా చేసి వెళ్లిపోయాడనే అర్థంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన 24 గంటల తర్వాత విజయసాయి రెడ్డి అదే స్థాయిలో ధీటుగా సమాధానం ఇచ్చారు. తానెవ్వరికీ భయపడే రకాన్ని కాదని స్పష్టం చేస్తూ తన సోషల్ మీడియా ఎకౌంట్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి వైసీపీ కి, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఆ విషయాన్నే జగన్ కి చెప్పానని కూడా విజయసాయి రెడ్డి చెప్పారు.
ఇప్పుడు తాజాగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan) వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి (Vijayasai Reddy) స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.
‘‘నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని. అందుకే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు లోనూ లేదు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా’’ అని పేర్కొన్నారు.
జగన్‌ చెప్పిందేమిటంటే?
‘‘మా రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురు. రాజకీయాల్లో ఉన్నపుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలి. మనంతట మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో రాజీపడి అటువైపు పోతే మన వ్యక్తిత్వం, విలువ, విశ్వసనీయత ఏంటి? సాయిరెడ్డికైనా, పోయిన ముగ్గురు ఎంపీలకైనా ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతే, వైసీపీ ఈ రోజు ఉందీ అంటే వారి వల్ల కాదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే ఉంది’’ అని జగన్ ఫిబ్రవరి 6న ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నారు.
Tags:    

Similar News