పొగమంచు ఎఫెక్ట్‌.. దారి మళ్లించిన విమానాలు

ల్యాండింగ్‌ సమస్యలు తలెత్తడంలో గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానాలు. చివరి దారి మళ్లించారు.;

Update: 2024-12-07 05:40 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాలకు పొగ మంచు ఇబ్బంది కరంగా మారింది. పొగ మంచు కారణంగా విమానాలు ల్యాంగింగ్‌ కావడం పెద్ద సమస్యగా మారింది. దీంతో విమానాలను దారి మళ్లించారు. గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాల్లో శనివారం ఈ సమస్య నెలకొంది. ఉదయం దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీని వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాల ల్యాండింగ్‌ సమస్యలు తీవ్రంగా మారాయి. దీంతో శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ కావలసిన ఎయిర్‌ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. శనివారం తెల్లవారు జామున ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం పొగ మంచు కారణంగా కొద్ది సేపు కాల్లోనే చక్కర్టు కొట్టింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. ప్రమాదం ఏదైనా జరిగిందేమోనని ఆందోళనలకు లోనయ్యారు. గాల్లో చక్కర్లు కొట్టిన ఎయిర్‌ ఇండియా విమానం గన్నవరంలో ల్యాండ్‌ కావడానికి వీల్లేక పోవడంతో చివరికి హైదరాబాద్‌కు దారి మళ్లించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. పొగ మంచు కారణంగా ల్యాండింగ్‌ సమస్యలు తలెత్తడంతో విమానాలను దారి మళ్లించారు. బెంగుళూరు–విశాఖ రావాల్సిన రెండు ఇండిగో విమానాలను హైదరాబాద్‌కు దారి మళ్లించారు. దీంతో పాటుగా ఢిల్లీ నుంచి విశాఖపట్నం రావలసిన ఇండిగో విమానాన్ని భువనేశ్వర్‌కు దారి మళ్లించారు.

Tags:    

Similar News