గురజాడ.. ఆధునిక యుగానికి అడుగుజాడv
మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సభ నవంబర్ 30న విజయనగరంలో జరిగింది. ఈ సభకు ప్రధాన వక్తగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఏమన్నారంటే..
గురజాడ అప్పారావు ఆధునిక యుగానికి వెలుగుజాడ అని కొనియాడారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ‘నేటి ఆధునిక యుగానికి జాడ చూపిన దార్శనికుడు గురజాడ అప్పారావు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మహాకవి.. అంతటి గొప్ప వ్యక్తి వర్ధంతికి హాజరు కావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది.. నా జీవితంలో ఈ రోజు గొప్ప శుభదినం’ అన్నారు జస్టిస్ రమణ. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో అప్పారావు వర్ధంతి సభ నవంబర్ 30న విజయనగరంలో జరిగింది. గురజాడ సాహితీ చైతన్యోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. తాను పుట్టింది ఏపీలోనైనా.. ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు హాజరు కాలేకపోయానని, నేటికి ఈ అవకాశం దక్కిందన్నారు. విజయనగరానికి ఇంతటి ఖ్యాతి దక్కిందంటే అది గురజాడ అప్పారావు, గిడుగు వెంకట రామమూర్తి, కోడి రామమూర్తి, ద్వారం వెంకట స్వామి నాయుడు వంటి వారివల్లేనన్నారు.