విజయసాయిరెడ్డి కుమార్తె భవనాల తొలగింపు.. గెలిచిన జనసేన కార్పొరేటర్

భీమిలి సముద్రతీరంలో నిర్మించిన ఆక్రమిత కట్టడాలపై జీవీఎంసీ కొరడా ఝులిపించింది. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ సముద్రతీరంలో నిర్మించిన కాంక్రీట్ గోడలను కూలగొట్టింది.

Update: 2024-09-04 13:24 GMT

భీమిలి సముద్రతీరంలో నిర్మించిన ఆక్రమిత కట్టడాలపై జీవీఎంసీ కొరడా ఝులిపించింది. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ సముద్రతీరంలో నిర్మించిన కాంక్రీట్ గోడలను కూలగొట్టింది. ఈ కట్టడాలు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి పేరిట ఉండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో నేహా రెడ్డి పేరిట ఉన్న భవనాలను అధికారులు తొలగించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహాయంతో విజయసాయిరెడ్డి ఈ నిర్మాణాలు చేపట్టారంటూ ఈ వ్యవహారంపై జనసేన కార్పోరేటర్ పీతలమూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. విచారణ జరిపింది. విచారణ క్రమంలో రక్షణ కల్పించాలంటూ విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడడ్ి కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మహావిశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయానని కోరింది.

నిబంధనలకు విరుద్ధమే: జీవీఎంసీ

కోర్టు ఆదేశాల మేరకు స్పందించిన జీవీఎంసీ తన నివేదిక ఇచ్చింది. ఇందులో తీరప్రాంతంలో నిర్మించిన కట్టడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగానే ఉందని స్పష్టం చేసింది. దీంతో 15 రోజుల్లో చర్యలు చేపట్టాలని జీవీఎంసీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జీవీఎంసీ చర్యలు చేపట్టి.. సదరు కట్టడాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు సంబంధించిన నివేదికను కూడా కోర్టుకు సమర్పించనుంది జీవీఎంసీ. వైసీపీ హయాంలో విశాఖ నుంచి భీమిలి వరకు కోస్టల్ పరాంతంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ అనేక నిర్మాణాలు జరిగాయని, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డి వ్యవహరించిన సమయంలో వీటన్నింటినీ నటీసులు ఇచ్చి తొలగించినప్పటికీ ఆ తర్వాత వీటి సంఖ్య అంతకుమించి పెరిగింది. వీటిలో చాలా కట్టడాలు నిబంధనలను ఉల్లంఘిస్తూ 2023, 2024 సంవత్సరాల్లో వెలిశాయని అధికారులు చెప్తున్నారు. తాజాగా హైకోర్టు ఉత్తర్వులతో విజయసాయిరెడ్డి కుమార్తె కట్టడాన్ని కూల్చివేశారు. ఈ క్రమంలో అక్రమ కట్టడాల విషయంలో జీవీఎంసీ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News