దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Update: 2024-11-28 04:55 GMT

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100కిమీ, నాగపట్నానికి 320కిమీ, పుదుచ్చేరికి 410కిమీ, చెన్నైకి 490కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది ఉత్తర–వాయువ్య దిశగా పయనించనుంది. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మూడు రోజులు పాటు దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35–45కిమీ గరిష్టంగా 55కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు.


Tags:    

Similar News