‘‘దాడి జరిగిందో.. జరిపించుకున్నారో’’.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై జరిగిన దాడిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలోనే కోడి కత్తి ఘటన జరిగిందని గుర్తు చేశారు.

Update: 2024-04-14 11:56 GMT
Source: Twitter

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి‌పై నిన్న విజవాడలో జరిగిన దాడిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడి జరిగిందో.. జరిపించుకున్నారో ఎవరికి తెలుసంటూ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కోడి కత్తి ఘటన కూడా ఎన్నికల సమయంలోనే జరిగిందని గుర్తు చేశారు. బీఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని గోకవరం బస్టాండ్ దగ్గర అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన అనంతరం కేఏ పాల్.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై నిజంగా దాడి జరిగి ఉంటే.. దానిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కేఏపాల్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిగిన తర్వాతే మళ్ళీ మాట్లాడతానని వెల్లడించారు.

పవన్ కూడా అమ్ముడుపోయారు

‘‘తమ్ముడు పవన్, ముద్రగడ కూడా అమ్ముడుపోయారు. నేను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దాంతో పాటుగా పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా బరిలో దిగాలని యోచిస్తున్నా. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తా. పిఠాపురంలో వంగా గీత చేసిన అభివృద్ధి ఏమీ లేదు. దొంగలు, అవినీతిపరులు, హంతకులు ప్రజల ముందుకు వస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయండి’’అని ఆయన కోరారు.

అయితే జగన్‌పై జరిగిన దాడి అంశంపై టీడీపీ పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆంధ్ర రాజకీయాల్లో మరో కమల్‌హాసన్ వచ్చారంటూ సెటైర్లు వేసింది. అయితే ఈ సెటైర్లు, పంచులపై వైసీపీ కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల పనేని విమర్శలు గుప్పిస్తోంది. జగన్‌ను ఎదుర్కోలేకే ఇలాంటి నిచరాజకీయాలకు ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయంటూ మండి పడుతోందని వైసీపీ.

Tags:    

Similar News