కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని వెంటాడుతున్న పోలీసులు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.;

Update: 2024-12-14 05:36 GMT

ఆంధ్రప్రదేశ్‌లో సాగు నీటి సంఘాల ఎన్నికలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. సాగు నీటి సంఘాల ఎన్నికలను తాము బహిష్కరించామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించినా.. ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నారు. భయబ్రాంతులకు గురి చేస్తూ.. గృహ నిర్భందాలకు, హౌస్‌ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ శ్రేణుల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ సాగు నీటి సంఘాల ఎన్నికల ప్రభావం కడప జిల్లాలో ఎక్కువుగా కనిపిస్తోంది. కడప జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలే టార్గెట్‌గా అరెస్టు కార్యక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని గత రెండు రోజులుగా పోలీసులు వెంటాడుతున్నారు. శుక్రవారం అవినాష్‌రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు శనివారం కూడా అది విధానాన్ని కొనసాగించారు. శనివారం తెల్లవారు జాము సమయంలోనే పెద్ద ఎత్తున పోలీసులు అవినాష్‌ ఇంటికి చేరుకున్నారు.
తెల్లవారు జాము నుంచే హౌస్‌ అరెస్టు చేశారు. అవినాష్‌రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిర్భందించారు. అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఇది వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఏపీలో సాగు నీటి సంఘాల ఎన్నికలను వైఎస్‌ఆర్‌సీపీ ఇది వరకే బహిష్కరించింది. ఈ ఎన్నికలు అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్నారని, కూటమి ప్రభుత్వ వైఖరిగా నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
Tags:    

Similar News