విజయవాడలో ఎన్టీఆర్ వజ్రోత్సవాలు
ఎన్టీఆర్‌కు అటు సినీ రంగం, ఇటు రాజకీయ రంగంతో అనుబంధం ఉండటం వల్ల రెండు రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు.;
నందమూరి తారక రామారావు సినీ జీవితం ప్రారంభించి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఎన్టీఆర్ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. డిసెంబరు 14న విజయవాడలో ఈ వజ్రోత్సవాలను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు, అక్కినేని కుటుంబం, చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నారు. ఇతర సినీ ప్రముఖులు, నిర్మాతలు, నటీనటులు హాజరు కానున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన వారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా మకుటం లేని మహారాజుగా ఎన్టీఆర్ వెలుగొందారు. దీంతో రాజకీయ రంగం నుంచి కూడా ప్రముఖ నాయకులను కూడా ఆహ్వానించ నున్నట్లు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్థన్ తెలిపారు. త్వరలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాలను అన్ని భాషల్లోకి విడుదల చేస్తామన్నారు. ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో వచ్చేలా కృషి చేస్తామన్నారు.