ఆంధ్రలో ఎన్ని నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయో తెలుసా!

ఆంధ్రలో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగింది. అయితే అసలు ఆంధ్రలో మొత్తం ఎన్ని నామినేషన్లకు ఆమోద ముద్ర పడిందో తెలుసా?

Update: 2024-04-29 15:32 GMT

ఆంధ్రలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడుక్కుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల క్రితమే నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తయింది. ఈ ప్రక్రియలో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు కలిపి 4,941 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 నామినేషన్లు , 25 ఎంపీ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల సంఘం వారు ఆ నామినేషన్ల పరిశీలన ప్రక్రియకు శ్రీకారం చుట్టి కొన్ని నామినేషన్లను తిరస్కరించింది.

దీంతో 175 అసెంబ్లీ స్థానాలకు దాఖలైన 4,210 నామినేషన్లలో కేవలం 2,705 నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. వీటిలో ఒకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్‌గా దాఖలైన నామినేషన్లను ఈసీ ఉపసంహరించింది. అదే విధంగా ఎంపీ స్థానాలకు దాఖలైన నామినేషన్లలో కూడా 503 నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అత్యధిక నామినేషన్లు దాఖలైన నియోజకవర్గంగా నంద్యాల పార్లమెంటు నిలిచింది. ఇక్కడ 36 నామినేషన్లు వచ్చాయి.

అదే విధంగా 12 నామినేషన్లతో రాజమండ్రి అత్యల్పంగా ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే తిరుపతి నుంచి అత్యధికంగా 48 నామినేషన్లు రాగా.. అత్యల్పంగా చోడవరం నుంచి 6 నామినేషన్లే దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ కూడా సోమవారంతో ముగియడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగనున్న వారికి ఆర్వోలు త్వరలోనే గుర్తులను కేటాయించనున్నారు.

Tags:    

Similar News