ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు లభ్యం

రేణిగుంట గోదాముల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు బయటపడ్డాయి. ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Update: 2024-03-28 07:37 GMT
రేణిగుంట గోదాముల్లో లభ్యమైన తాయిలాలు

ఆంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేణిగుంట గోదాముల్లో చేసిన సోదాల్లో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికల తాయిలాలు బయటపడ్డారు. వీటిలో చేతి గడియారాలు, గోడుగులు, కండువాలు, ఆంప్లి‌పైర్‌లు, టీషర్ట్స్, టోపీలు, డమ్మీ ఈవీఎం మిషన్‌లు ఉన్నాయి. అక్కడే దగ్గర్లోనే ఉన్న ఇతర గోడౌన్‌లలో డబ్బుల కట్టలు, కుక్కర్లు, ఫ్యాన్‌లు ఉన్నట్లు సమాచారం. అయితే రేణిగుంటలో రెండో రోజు కొనసాగిన తనిఖీలు జరుగుతుండగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హడావుడిగా అక్కడకు చేరుకున్నారు.

బిల్లులు ఉన్నాయని చెప్తూ మీడియాను కూడా వాళ్లు అనుమతించలేదు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గోడౌన్‌లలో భారీ మొత్తంలో తాయిలాలు దొరికినప్పుడు ఎన్నికల అధికారులు ఏమైయ్యారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గోడౌన్‌లోలో ఎన్నికల బహుమతులను భద్రపరచం ఎన్నికల నియమావళికి విరుద్దం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. వీటిపై వెంటనే ఎస్‌పీ, కలెక్టర్ దృష్టి సారించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News