పవన్ కల్యాణం.. పవిత్ర సంగమ స్నానం
పవన్‌తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆనంద్ సాయి ఉన్నారు. యూపీ సీఎం యోగి పుణ్యస్నానం చేస్తారని అనుకున్నా ఆయన రాలేదు.;
By : The Federal
Update: 2025-02-18 17:03 GMT
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళాలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. గంగాదేవికి పూజలు చేసి, హారతులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 18న ప్రయాగ్‌రాజ్ (Prayagraj) వెళ్లారు. ఆయన, ఆయన భార్య, కుమారుడు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం (Triveni Sangam)లో పవిత్ర స్నానం చేసినట్టు జనసేన నాయకులు ట్వీట్ చేశారు. ప్రయాగ్ రాజ్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. పవన్ కల్యాణ్‌తో కలిసి యూపీ సీఎం యోగి (UP CM Yogi) పుణ్యస్నానం చేస్తారని ముందుగా అనుకున్నా ఆదిత్యనాధ్ రాలేదు. పవన్ రాకతో కుంభమేళాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలు సందర్శించిన పవన్ మంగళవారం మధ్యాహ్నం ప్రయోగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లారు. పవన్‌తో పాటు ఆయన పెద్ద కుమారుడు అకీరా నందన్, ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.
ఈ మహా కుంభమేళా జనవరి 13, 2025న ప్రారంభమై, ఫిబ్రవరి 26, 2025న ముగుస్తుంది. భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఈ మహోత్సవంలో పాల్గొనడం కోసం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమయం కేటాయించారు.
పవన్ కల్యాణ్ తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి కుంభమేళాకు వెళ్లారు. మాఘ పౌర్ణమి సందర్భంగా, ఫిబ్రవరి 13, 2025న, వారు కేరళలోని అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు.
మహా కుంభమేళా సందర్భంగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ కారణంగా, ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్ నుండి త్రివేణి సంగమం వరకు హెలికాప్టర్ సేవలు కూడా ప్రారంభించారు. ఇది భక్తులకు ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు సహాయపడుతోంది.
.