అదంతా జగన్ మాయ.. రఘురామ సంచలన వ్యాఖ్యలు

నరసాపురం టికెట్ అంశంపై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ ఇవ్వొద్దని విష్ణువర్దన్ కోరడం వెనక జగన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

Update: 2024-03-14 06:44 GMT
Source: Twitter


ఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ సీటు కీలకంగా మారింది. ఆ సీట్ టికెట్‌ను రఘుమారకృష్ణ రాజుకు ఇవ్వొద్దని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కోరుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా విష్ణువర్ధన్ చేస్తున్న మాయ కాదు జగన్ మాయ అని వ్యాఖ్యానించారు. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్ తనకు రాకుండా చేయడానికి జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు నరసాపురం టికెట్ తనకొస్తే వైసీపీకి భయమెందుకని ప్రశ్నించారు.

నరసాపురం గురించి విష్ణువర్దన్‌కి ఎందుకు

‘‘కూటమిలో భాగంగా నరసాపురం టికెట్ నాకు దక్కకుండా విష్ణువర్ధన్ రెడ్డి అనుకుంటున్నట్లు నాకు సమాచారం వచ్చింది. కానీ నా టికెట్‌ను అడ్డుకోవాలన్నది విష్ణ చేస్తున్న పని కాదు. జగన్ చేయిస్తున్న పని. నరసాపురం టికెట్ విషయంలో విష్ణు.. జగన్ వదిలిన బాణమే. ఏది ఏమైనా ఈ టికెట్ నాకు రాకూడండా చేయాలని సీఎం జగన్ తెగ కష్టపడుతున్నారు. అందులో భాగంగానే నాకు వ్యతిరేకంగా విష్ణువర్ధన్ ప్రయోగిస్తున్నారు. విష్ణువర్దన్‌ది కదిరి ఆయనకు నరసాపురం గురించి ఎందుకు. అసలు ఎంపీ టికెట్ తనకు వస్తే జగన్‌కు భయమెందుకు. వాళ్లు ఎన్ని కుట్రలు చేసిన నాకు టికెట్ రావడం పక్కా. అందులో సందేహం లేదు’’అని వ్యాఖ్యానించారు.
అయితే పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన లోక్‌సభ స్థానాల్లో నరసాపురం కూడా ఒకటి. ఇప్పటికే ఈ సీటు టికెట్‌ను రఘురామకు కేటాయించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా నరసాపురం టికెట్‌ను రఘురామకే ఇవ్వాలని టీడీపీ, జనసేన కూడా బీజేపీని కోరాయని, అందుకు కమలం పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పొత్తును విడగొడ్డటానికి జగన్ కుట్ర

ఆంధ్రలో టీడీపీ-బీజేపీ-జనసేన ఒక్కటి కావడంతో జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని రఘురామ ఆరోపించారు. దాంతో ఎలాగైనా రాష్ట్రంలో పొత్తును విడగొట్టడానికి జగన్ కుట్రలు పన్నుతున్నారని, అందులో భాగంగానే తనకు వ్యతిరేకంగా విష్ణువర్దన్‌ను ప్రయోగించారని విమర్శించారు. కానీ జగన్ ఎంత ప్రయత్నించినా ఈసారి ఆంధ్రలో ఆయన ఓటమి తథ్యమని, తమ ఓటు ఎవరికి వేయాలో ప్రజలు నిర్ణయించుకుని, పోలింగ్ తేదీ కోసం వేచి చూస్తున్నారన్నారు. ఈసారి జగన్ కుట్రలు పారవని, పొత్తును నామమాత్రంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడిందని, ఒకరిద్దరు విమర్శలు, ఆరోపణలు చేసినంత మాత్రాన ఈ పొత్తు విడిపోదని ధీమా వ్యక్తం చేశారు.


Tags:    

Similar News