ఆ 25 మంది సేఫ్

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదప్రవాహం నదులను తలపిస్తోంది.

Update: 2024-07-18 17:12 GMT

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదప్రవాహం నదులను తలపిస్తోంది. ఏపీలో పలు జిల్లాల్లో వరద ఉదృతి బాగా పెరిగింది. గురువారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ వేలేరుపాడు మండలంలో అల్లూరి నగర్ వద్ద కొడిసేల కాలువలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో కాలువలోని నీటిమట్టం పెరిగి రహదారిపైకి ప్రవహించింది. అటుగా వెళ్తున్న కారు నీటిలో చిక్కుకుపోవడం గమనించిన స్థానికులు... కారులో ఉన్న ఐదుగురిని రక్షించారు. అనంతరం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు జంగారెడ్డి గూడెం ఆర్డీఓ అద్దయ్య తెలిపారు. అలాగే, జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం వద్ద వరదలో చిక్కుకున్న 11 మందిని జేసిబి సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఇటు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో కట్టమైసమ్మగుడి వద్ద భారీగా వరద ప్రవహిస్తోంది. వరదలో చిక్కుకున్న ఐదు కార్లు, నాలుగు ఆటోలు, 10 బైకులపై ప్రయాణిస్తున్న మొత్తం 25 మందిని హెలికాప్టర్ సాయంతో రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Tags:    

Similar News