ఆంధ్రప్రదేశ్‌లో రేపు తీవ్ర వడగాల్పులు
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.;
మార్చి 17 సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో వడగాల్పులు వీచనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లాలో 15 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే సోమవారం 167 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 16 మండలాలు, విజయనగరం జిల్లాలో 10, పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 2, అనకాపల్లిలో 16, కాకినాడలో 15, కోనసీమలో 9, తూర్పుగోదావరిలో 19, పశ్చిమగోదావరిలో 3, ఏలూరులో 13, కృష్ణాలో 10, ఎన్టీఆర్ జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 14, బాపట్ల జిల్లాలో 1, పల్నాడు జిల్లాలో19 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.