అమెరికాలో తెనాలి యువతి మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి;

Update: 2024-12-15 03:34 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన నాగశ్రీవందన పరిమళ ఉన్నత చదువులకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. పరిమళ తల్లిదండ్రులు గణేష్, రమాదేవి. గణేష్‌ తెనాలిలో వ్యాపారిం. 2022లో అమెరికా వెళ్లిన ఆమె అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఎమ్మెస్సీ చదువుతున్నారు. రెండేళ్ల పాటు అక్కడ అంతా సవ్యంగానే సాగింది. తమ కుమార్తె బాగా చదువుకుంటోందని పరిమళ తల్లిదండ్రులు సంతోషంలో ఉన్నారు. చదువు పూర్తి అయితే అక్కడే ఉద్యోగంలో చేరి అమెరికాలోనే సెట్‌ అవుతుందని భావించారు. ఇంతలోనే ఘోరం జరిగి పోయింది. శనివారం రాత్రి పరిమళ ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్‌ బలంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన పరిమళ ప్రాణాలు విడిచారు. దీంతో తెనాలిలో విషాధం నెలకొంది. పరిమళ మరణం వార్త తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో తెనాలిలోని పరిమళ ఇంటి వద్ద విషాదం అలముకుంది.



Tags:    

Similar News