ఏపీలో విద్యార్థులకు స్పెషల్ కార్డులు
విద్యార్థుల ప్రగతిని, ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చి దిద్దడానికి తోడ్పడే విధంగా వీటిని రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి ప్రత్యేక కార్డులను అందించనున్నారు. చదువుల్లో విద్యార్థుల ప్రోగ్రెస్‌ను ఎప్పటికప్పుడు మెరుగు పరచడానికి, ఆరోగ్య పరంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వీలుగా ఈ కార్డులను రూపోందించారు. ఆరోగ్యపరమైన వివరాలతో పాటు విద్యార్థి పూర్తి సమాచారాన్ని పొందుపరచనున్నారు. హోలిక్ కార్డుల పేరుతో ఈ కార్డులను అందించనున్నారు. విద్యార్థి ఎత్తు, బరువు, బ్లడ్ గ్రూపు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)తో సహా పూర్తి వివరాలను అందులో పొందుపరుస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి విద్యార్థుల వివరాలను ఈ కార్డుల్లో నమోదు చేస్తారు. ఇప్పటి వరకు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేవారు. వీటిని ఇప్పుడు మోడిఫై చేశారు. అన్ని వివరాలతో కలిపి హోలిస్టిక్ కార్డులను రూపొందించారు. అంతేకాకుండా ప్రతీ కార్డు వెనుక భాగంలో క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు.