పవన్‌పై దాడి.. తప్పించుకున్న జనసేనాని
జనసేనాని పవన్ కల్యాణ్‌పై గుంటూరు జిల్లా తెనాలిలో దాడి జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఈరోజు తెనాలిలో గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు. అయితే ఈ దాడిలో పవన్‌కు ఎటువంటి ప్రమాదం కాలేదు. కానీ పవన్‌పై దాడి జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడిని మరువక ముందే పవన్‌పై కూడా దాడి జరగం ప్రస్తుతం సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే..
పవన్ కల్యాణ్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘వారాహి విజయభేరీ యాత్ర’ను జోరుగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈరోజు గుంటూరు జిల్లా తెనాలిలో యాత్ర చేస్తున్నారు. ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి పవన్‌పైకి రాయి విసిరాడు. ఆ రాయి పవన్‌కు తగలకుండా ఆయనకు దగ్గర్లో పడిపోయింది. దాంతో పవన్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వెంటనే స్పందించిన జనసైనికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇది వైసీపీ పనే
సీఎం జగన్‌పై దాడి జరిగి 24 గంటలు కూడా గడవకముందే పవన్ కల్యాణ్‌పై రాయితో దాడి జరడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది వైసీపీ నేతల పనే అని జనసైనికులు ఆరోపిస్తున్నారు. సింపతి కోసమే జగన్ తనపై దాడి చేయించుకున్నారని, ఇప్పుడు జనసేనను అడ్డుతప్పించుకోవాలని పవన్‌పై దాడి చేయించారంటూ జనసేనికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.