నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు.. పిఠాపురంలో పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేతలు బుద్దప్రసాద్, జయకృష్ణ ఈరోజు పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా మార్చుకున్నారు. తాము ఎక్కడి నుంచి పోటీ చేయనుంది వెల్లడించారు.

Update: 2024-04-01 13:29 GMT
Source Twitter

ఆంధ్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడినప్పటికీ తాజాగా టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు జనసేన గూటికి చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో టీడీపీ నేతలు మండలి బుద్దప్రసాద్, నిమ్మక జయకృష్ణ.. జనసేన కండువా కప్పుకున్నారు. వారిని పవన్ కల్యాణ్ పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా నిమ్మక జయకృష్ణ, మండల బుద్ద ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయకృష్ణ మాట్లాడుతూ.. ‘‘పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోవడం సంతోషంగా ఉంది. జనసేన తరపున పాలకొండ నుంచి బరిలో దిగుతాను. ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్ కలిసి నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. వారి కూటమిని పాలకొండ నుంచి తరిమి తరిమి కొడతాం. ఈ అభ్యర్థిత్వంపై పవన్ కూడా సానుకూలంగా స్పందించారు. రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది. పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది’’అని వెల్లడించారాయన.

అనంతరం మండలి బుద్ద ప్రసాద్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘రానున్న ఎన్నికల్లో జనసేన టికెట్ కోసం ఆశించిన వారు చాలా మంది భంగపాటుకు గురయ్యారు. వారిని అన్ని విషయాలను పవన్ మాట్లాడతారు. అవని గడ్డ బరిలో నిలబడమని పవన్ నన్ను కోరారు. అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మద్దతు తెలిపారు. నాకూ పవన్‌కు అనేక విషయాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. పవన్ కల్యాణ్‌కు ఓట్ల రాజకీయం తెలియదు. సమస్యలపైనే పోరాడటానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన తొలి రోజు నుంచే ఆయన ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు’’అని చెప్పారు.
నన్ను బ్లేడ్‌తో కట్ చేస్తున్నారు
జయకృష్ణ, బుద్ద ప్రసాద్‌ను పార్టీలోకి స్వాగతించిన అనంతరం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు కూడా ఉంటున్నాయని చెప్పారు. ‘‘నన్ను కలవడానికి అధిక సంఖ్యలో వ్యక్తులు వచ్చినప్పుడు వారిలో కొందరు సన్నని బ్లేడ్లు తీసుకొస్తున్నారు. వాటితో నన్ను, సెక్యూరిటీ వాళ్లను కోస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే అభిమానులు అధికసంఖ్యలో వచ్చినప్పుడు కూడా తప్పకుండా ప్రోటోకాల్‌ను పాటిద్దాం. ఏది ఏమైనా నన్ను కలిసే ప్రతి ఒక్కరితో నేను ఫొటో దిగుతాను. ప్రతిరోజు 200 మందిని కలుస్తాను. పిఠాపురాన్ని స్వస్థలం చేసుకోవడమే నా లక్ష్యం’’అని వెల్లడించారు.
Tags:    

Similar News