మాజీ మంత్రి పేర్ని నాని కేసు వాయిదా
రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.;
మాజీ మంత్రి పేర్ని నాని కేసుకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఇది వరకు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను జనవరి 8వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఉన్నత న్యాయం స్థానం తదుపరి విచారణను జనవరి7కు వాయిదా వేసింది. పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరుతో నిర్వహిస్తున్న సొంత గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిని కూడా నిందితుడిగా చేర్చారు. పేర్ని నాని ఆదేశాల మేరకే రేషన్ బియ్యం మాయమయ్యాయనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నానిని ఏ6గా చేర్చుతూ మచిలీపట్నం తాలూకాలోని రాబిన్‌సన్ పోలీసు స్టేషన్‌లో పోలీసులు నానిపై కేసు నమోదు చేశారు. అయితే దీనిపై పేర్ని నాని ఇది వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుపైన సోమవారం విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటీషనర్ పేర్ని నానిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన మంధ్యతర ఉత్తర్వులను జనవరి 8 వరకు పొడిగించింది.