కాళ్లా వేళ్లాపడినా కాల్చి చంపేశారు
పహల్గాం ఉగ్రదాడిలో విశాఖ వాసి చంద్రమౌళి దుర్మరణం. విశాఖ వెళ్లి నివాళులు అర్పించిన చంద్రబాబు.;
వేసవి విహారం కోసం కశ్మీర్ వెళ్లిన విశాఖకు చెందిన జేఎస్ చంద్రమౌళి (70) పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో దుర్మరణం పాలవడం విశాఖలో విషాదాన్ని నింపింది. శ్రీకాకుళానికి చెందిన చంద్రమౌళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నతోద్యోగిగా పనిచేసి పదేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం నగరంలోని పాండురంగాపురంలో నివాసం ఉంటూ విశాఖ పెన్షనర్స్ క్లబ్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 18న మరో ఇద్దరు స్నేహితులు పీ అప్పన్న, ఆర్ శశిధర్ కుటుంబాలతో కలిసి చంద్రమౌళి తన భార్య నాగమణిని వెంటబెట్టుకుని ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కశ్మీర్‌కు వెళ్లారు. శ్రీనగర్‌లో బస చేస్తూ ఉదయాన్నే ఎంపిక చేసుకున్న పర్యాటక ప్రదేశాలకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తున్నారు. అలాగే మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పహల్గాం చేరుకున్నారు. అక్కడ ఒక హోటల్ గది వాష్‌రూమ్‌లో ఉండగా కాల్పుల మోత విని బయటకు వచ్చారు చంద్రమౌళి. అవి ఉగ్రవాదుల కాల్పులుగా గుర్తించి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆయనతో ఉన్న మరో ఐదుగురు పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ చంద్రమౌళి çహృద్రోగి (కొన్నాళ్ల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ) కావడంతో వేగంగా పరిగెత్తలేకపోయి ఉగ్రవాదులకు చిక్కారు. తనను చంపొద్దని చంద్రమౌళి ఉగ్రవాదులను కాళ్లావేళ్లా పడ్డారు. తనను చంపవద్దని వేడుకున్నా కనికరించకుండా తుపాకీతో కాల్చి చంపారు. పహల్గాంలో కాల్పుల ఘటన విశాఖలో ఉంటున్న ఆయన బంధువులు తెలుసుకుని ఆందోళనతో వాకబు చేశారు. ఆయన కనిపించలేదని అక్కడ నుంచి సమాచారం రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం నాటికి చంద్రమౌళిని కాల్చి చంపారని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈనెల 18న బయల్దేరి వెళ్లిన చంద్రమౌళి దంపతులు 26న తిరిగి విశాఖ చేరుకోవలి ఉంది. ఇంతలోనే టెర్రరిస్టుల ఘాతుకానికి బలయ్యారుని ఆయన తోడల్లుడు కుమార్‌రాజా కన్నీరొలుకుతూ చెప్పారు.
కూతుళ్లను అమెరికా పంపి..
కశ్మీర్ వెళ్తున్నట్టు చెప్పలేదు..